చనిపోయే ముందు బాత్ రూం నుంచి శ్రావణి ఫోన్!

TV Serial Actress Sravani ఆత్మహత్య కేసులో ఎన్నో ట్విస్టులు. పూటకో విషయం బయటపడుతోంది. దీనికి సంబంధించిన ఆడియో టేపులు బహిర్గతమయ్యాయి. కానీ ఆమె ఎందుకు ఆత్మహత్య చేసుకుంది ? దీనికి కారణం ఎవరు ? అనేది మాత్రం మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారిపోయింది. తాజగా శ్రావణి చివరి ఫోన్ కాల్ బయటపడిందంట.
ఆత్మహత్య చేసుకోవడానికంటే ముందు..శ్రావణి దేవరాజ్ కు ఫోన్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. బాత్ రూంలోకి వెళ్లిన శ్రావణి..రహస్యంగా దేవ్ రాజ్ తో మాట్లాడిందంట. తనను పెళ్లి చేసుకోవాలని అభ్యర్థించినా..దేవ్ రాజ్ నో చెప్పడంతో శ్రావణి తీవ్ర మానసికంగా బాధ పడిందని తెలుస్తోంది. అందుకే ఆత్మహత్య చేసుకుందని ఆమె తల్లి ఆరోపణలు చేస్తోంది.
తన కూతురును టార్చర్ పెట్టి..ఆత్మహత్య చేసుకొనే విధంగా చేసిన దేవ్ రాజ్ ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తోంది. అన్ని విధాల సహకరించిందని, అతని ఖర్చులన్నీ తన కూతురే చూసుకొనేదని చెబుతోంది.
మరోవైపు ఈ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకొనే అవకాశాలున్నాయి. ఇప్పటికే దేవ్ రాజ్ ను పోలీసులు విచారించారు. తాజాగా.. సాయి కృష్ణారెడ్డి, శ్రావణి కుటుంబసభ్యులను ఎస్సార్ నగర్ పోలీసులు విచారిస్తున్నారు. కీలక అంశాలను వారి నుంచి రాబట్టబోతున్నారు. దేవ్ రాజ్, సాయి, అశోక్ రెడ్డి చెప్పిన వివరాల ప్రకారం..ఈ కేసుపై ఓ నిర్ణయానికి రానున్నారు పోలీసులు.
సస్పెన్స్‌గా మారిన టీవీ ఆర్టిస్ట్ శ్రావణి కేసులో.. సాయికృష్ణారెడ్డి పాత్రపై పోలీసులు మరింతగా దృష్టి సారిస్తున్నారు. సాయి వేధింపుల వల్లే శ్రావణి ఆత్మహత్య చేసుకుందని భావిస్తున్న పోలీసులు… ఈ సూసైడ్ మిస్టరీలో అతడి పాత్ర ఏంటన్న కోణంలో కూపీ లాగుతున్నారు. ఇందుకోసం అతడిని విచారించనున్నారు. తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు నుంచి హైదరాబాద్ వచ్చిన సాయి… ఇవాళ పోలీసుల ముందు హాజరుకానున్నాడు.
శ్రావణి సోదరుడు శివ, తల్లిదండ్రులు కూడా హైదరాబాద్ చేరుకున్నారు. శ్రావణితో ఐదేళ్ల క్రితం నుంచే సాయికి పరిచయం ఉంది. ఈ పరిచయమే ప్రేమగా మారింది. అయితే కొత్తగా పరిచయం అయిన వ్యక్తులతో శ్రావణి చాలా క్లోజ్‌గా ఉండటం సాయికి నచ్చలేదు. ఇదే విషయంలో శ్రావణి, సాయికి మధ్య వాగ్వాదం జరిగింది. ట్రయాంగిల్ లవ్ స్టోరీనే శ్రావణి ఆత్మహత్యకు కారణంగా తెలుస్తోంది.
ఇప్పటి వరకూ ఉన్న ఆధారాలు శ్రావణి కేసులో.. సాయి పాత్ర కీలకంగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. సాయిని విచారించి.. కేసులో అసలు నిందితున్ని గుర్తించనున్నారు పోలీసులు.