Cold Weather: తెలంగాణలో అసాధారణ స్థాయిలో కనిష్ట ఉష్ణోగ్రతలు

హిమాలయాల నుంచి తక్కువ ఎత్తులో వీస్తున్న గాలుల కారణంగా ఆ ప్రభావం తెలంగాణ పై ఎక్కువగా పడుతున్నట్లు హైదరాబాద్ వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు

Cold Weather: తెలంగాణలో అసాధారణ స్థాయిలో కనిష్ట ఉష్ణోగ్రతలు

Cold

Updated On : January 30, 2022 / 7:07 AM IST

Cold Weather: తెలంగాణ రాష్ట్రంలో గత రెండు రోజులుగా అతిశీతల వాతావరణం నెలకొంది. రాత్రి వేళ ఉష్ణోగ్రతలు సరాసరి 8 డిగ్రీల కనిష్ట స్థాయికి పడిపోతున్నాయి. ఉత్తర భారతంలో అతిశీతల వాతావరణ ప్రభావం, మరియు హిమాలయాల నుంచి తక్కువ ఎత్తులో వీస్తున్న గాలుల కారణంగా ఆ ప్రభావం తెలంగాణ పై ఎక్కువగా పడుతున్నట్లు హైదరాబాద్ వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, మంచిర్యాల్, నిజామాబాదు, కరీంనగర్ జిల్లాల్లోనూ, హైదరాబాద్ నగరంలోనూ అతిశీతల వాతావరణం ఉంటుంది. ఆది, సోమ, మంగళవారాల్లోనూ చలితీవ్రత కొనసాగుతుందని కావున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణశాఖ అధికారులు సూచించారు. తెలంగాణ రాష్ట్రంలోనే అత్యల్పంగా ఆదిలాబాద్ జిల్లా ఆర్లి(టీ) గ్రామంలో శనివారం నాడు 4.9 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదు అయింది.

Also read: Venkatesh : బాలీవుడ్ లోకి రీఎంట్రీ ఇస్తున్న వెంకీమామ

ఉమ్మడి ఆదిలాబాద్ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతున్నాయి. దీంతో చలికి తట్టుకోలేక ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. హైదరాబాద్ నగరంలోనూ అసాధారణ వాతావరణం నెలకొంది. తెల్లవారుఝామున గడ్డకట్టే చలితో నగరవాసులు ఇబ్బంది పడుతున్నారు. ఉదయం 11 గంటల సమయంలోనూ చలి తీవ్రత తగ్గడం లేదు. మరో రెండు రోజుల పాటు తెలంగాణలో అసాధారణ స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోతాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ వాతావరణశాఖ అధికారులు తెలిపారు.

Also read: Cricket Canada : 9మంది క్రికెటర్లకు కరోనా.. ప్లేయర్లు లేక వరల్డ్‌కప్ నుంచి వైదొలిగిన జట్టు