తెలంగాణ వ్యాప్తంగా డీఎస్సీ ఉపాధ్యాయ పోస్టింగ్ కౌన్సిలింగ్ వాయిదా.. ఎందుకంటే?

తదుపరి పోస్టింగ్ కౌన్సెలింగ్ తేదీలు త్వరలో ప్రకటిస్తామని విద్యా శాఖ తెలిపింది.

తెలంగాణ వ్యాప్తంగా డీఎస్సీ ఉపాధ్యాయ పోస్టింగ్ కౌన్సిలింగ్ వాయిదా.. ఎందుకంటే?

Updated On : October 15, 2024 / 10:45 AM IST

తెలంగాణ వ్యాప్తంగా డీఎస్సీ ఉపాధ్యాయ పోస్టింగ్ కౌన్సిలింగ్ వాయిదా పడింది. ఇటీవలే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అభ్యర్థులు నియామక పత్రాలు అందుకున్న విషయం తెలిసిందే.

డీఎస్సీ 2024 నియామక పత్రాలు అందుకున్న వారికి నేడు పోస్టింగ్ కౌన్సెలింగ్ జరగాల్సి ఉండగా దాన్ని వాయిదా వేస్తున్నట్లు తెలంగాణ విద్యాశాఖ ప్రకటించింది. తదుపరి పోస్టింగ్ కౌన్సెలింగ్ తేదీలు త్వరలో ప్రకటిస్తామని విద్యా శాఖ తెలిపింది.

పలు సాంకేతిక కారణాల వల్ల కౌన్సిలింగ్ వాయిదా వేస్తున్నట్లు వివరించింది. కాగా, రేవంత్ చేతుల మీదుగా ఇటీల మొత్తం 10,006 మంది అభ్యర్థులకు నియామక పత్రాలు అందాయి.

పోస్టింగ్ కోసం డీఈవోలు సూచించిన ఆఫీసుల్లో కౌన్సిలింగ్ కు అభ్యర్థులు ఇవాళ హాజరుకావాల్సి ఉంది. ర్యాంకుల ఆధారంగా మెరిట్ ప్రకారం కౌన్సిలింగ్ జరుగుతుందని అన్నారు. కొందరు అభ్యర్థులు ఇవాళ ఉదయం నుంచే ఆఫీసుల ముందు నిలబడ్డారు. చివరకు వారి కౌన్సెలింగ్ వాయిదా పడింది.

దేశంలో అతిపెద్ద ఐపీవో.. నేటి నుంచి హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా లిమిటెడ్‌ ఐపీవో