తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీకి ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ

మొదట దరఖాస్తులను స్వీకరించి, నిశితంగా పరిశీలిస్తారు.

New Ration Cards

తెలంగాణలో కొత్త రేషన్ కార్డులను ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. జనవరి 26 నుంచి కొత్త రేషన్‌ కార్డులు జారీ చేస్తామని ఇప్పటికే సర్కారు ప్రకటించిన విషయం తెలిసిందే. మంత్రివర్గ ఉపసంఘం చేసిన ప్రతిపాదనల మేరకు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ జరగనుంది.

మొదట దరఖాస్తులను స్వీకరించి, నిశితంగా పరిశీలిస్తారు. అనంతరం, ఇటీవల జరిపిన కులగణన సర్వే ఆధారంగా రేషన్ కార్డులు లేని కుటుంబాల లిస్టును పరిశీలన నిమిత్తం పంపుతారు.

మార్గదర్శకాలు..

  • ఈ నెల 26 నుంచి కొత్త రేషన్ కార్డుల జారీ
  • క్యాబినెట్ సబ్ కమిటీ రికమండేషన్ ఆధారంగా లబ్ధిదారుల ఎంపిక
  • కులగణన ఆధారంగా రేషన్ కార్డు లేనివారికి కొత్త కార్డుల మంజూరు
  • జిల్లాల్లో కలెక్టర్లు, జీహెచ్ఎంసీ కమిషన్ పరిశీలన తరువాత రేషన్ కార్డుల జారీ
  • రేషన్ కార్డుల లబ్దిదారుల జాబితాను గ్రామ, వార్డు సభల్లో ప్రదర్శించాక ఆమోదం
  • రేషన్ కార్డులలో కుటుంబ సభ్యుల చేర్పులు, మార్పులకు అవకాశం
  • మండల స్థాయిలో ఎంపీడీవో, యూఎల్‌బీలో మున్సిపల్ కమిషనర్ ఈ మొత్తం ప్రక్రియకు బాధ్యులు
  • ముసాయిదా లిస్టును గ్రామసభ, వార్డులో ప్రదర్శించిన తర్వాత ఆమోదం

గుడ్‌న్యూస్‌.. నిజామాబాద్‌లో పసుపు బోర్డును వర్చువల్‌గా ప్రారంభించనున్న పీయూష్ గోయల్‌