లగచర్ల భూసేకరణ నోటిఫికేషన్‌ను ఉపసంహరించుకున్న ప్రభుత్వం

ఫార్మా పరిశ్రమల ఏర్పాటు కోసం గ్రామసభను నిర్వహించాలని యత్నించగా అక్కడ ఇటీవల కలకలం రేగింది.

లగచర్ల భూసేకరణ నోటిఫికేషన్‌ను ఉపసంహరించుకున్న ప్రభుత్వం

CM Revanth Reddy

Updated On : November 29, 2024 / 2:27 PM IST

వికారాబాద్‌ జిల్లా లగచర్లలో ఫార్మా విలేజ్‌ల కోసం ఇచ్చిన భూసేకరణ నోటిఫికేషన్‌ను తెలంగాణ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. మొత్తం 580 మంది రైతులకు చెందిన 632 ఎకరాల భూసేకరణ నోటిఫికేషన్‌ను సర్కారు ఉపసంహరించుకుంది.

తెలంగాణ సర్కారు ఈ నోటిఫికేషన్‌ను ఆగస్టు 1న జారీ చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత లగచర్లలో వివాదాస్పద ఘటనలు చోటుచేసుకున్నాయి. ఫార్మా పరిశ్రమల ఏర్పాటు కోసం గ్రామసభను నిర్వహించాలని యత్నించగా అక్కడ ఇటీవల కలకలం రేగింది.

భూసేకరణకు వ్యతిరేకంగా రైతులు ఆందోళనలు చేపట్టారు. దీంతో ప్రజాభిప్రాయ సేకరణకు కోసం ప్రభుత్వం గ్రామసభ నిర్వహించడానికి జిల్లా కలెక్టర్‌తో పాటు ముఖ్య అధికారులను అక్కడికి పంపింది. దీంతో జిల్లా కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌తో పాటు పలువురు అధికారులపై గ్రామస్థులు దాడికి యత్నించారు.

ప్రత్యేక అధికారి వెంకట్‌ రెడ్డికి, డీఎస్పీ శ్రీనివాస్‌ రెడ్డికి గాయాలయ్యాయి. దీనిపై కేసు నమోదుచేసుకున్న పోలీసులు బీఆర్ఎస్‌ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డితో పాటు పలువురిని అరెస్ట్ చేశారు. దీనిపై బీఆర్ఎస్‌ తీవ్ర విమర్శలు గుప్పించింది.

YS sharmila: మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఆస్కార్ అవార్డు ఇవ్వాలి: షర్మిల ఎద్దేవా