TGPSC OTR 2026 Update : నిరుద్యోగులకు బిగ్ అలర్ట్.. ఇక ఇదే లాస్ట్ఛాన్స్.. ఏప్రిల్ 10 వరకు మాత్రమే! సద్వినియోగం చేసుకోండి..
TGPSC OTR 2026 Update : తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదరుచూస్తున్న అభ్యర్థులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) శుభవార్త చెప్పింది. వన్ టైమ్ రిజిస్ట్రేషన్ (OTR) గడువు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది.
TGPSC OTR 2026 Update
TGPSC OTR 2026 Update : తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదరుచూస్తున్న అభ్యర్థులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) శుభవార్త చెప్పింది. వన్ టైమ్ రిజిస్ట్రేషన్ (OTR) గడువు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఇదే చివరి అవకాశమని టీజీపీఎస్సీ పేర్కొంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
అభ్యర్థులు తమ వివరాలను సవరించుకునేందుకు ఏప్రిల్ 10 వరకు అవకాశం కల్పించినట్లు టీజీపీఎస్సీ సెక్రటరీ హరిత తెలిపారు. వాస్తవానికి.. మార్చి 25వ తేదీతో గడువు ముగియాల్సి ఉంది. అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు తాజాగా గడువును పెంచుతూ టీజీపీఎస్సీ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులు వ్యక్తిగత వివరాల అప్డేట్తోపాటు, విద్యార్హతల ధ్రువపత్రాలను అప్లోడ్ చేయాలని స్పష్టం చేశారు. ఈ ప్రక్రియను పూర్తి చేసిన అభ్యర్థులకే భవిష్యత్తులో విడుదలయ్యే ఉద్యోగ నోటిఫికేషన్లకు దరఖాస్తు చేసుకునే అర్హత ఉంటుందని పేర్కొన్నారు.
కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకునే వారికి గడువు ముగిసిన తర్వాతకూడా దరఖాస్తు చేసుకోవచ్చని, అయితే, ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు మాత్రం నిర్ణీత గడువులోగా తమ వివరాలను తప్పనిసరిగా అప్డేట్ చేయాలని టీజీపీఎస్సీ సెక్రటరీ హరిత వెల్లడించారు. అవసరమైన సర్టిఫికెట్లు ఏప్రిల్ 10లోగా అప్లోడ్ చేయాలి. ఇలా చేయకపోతే రాబోయే టీజీపీఎస్సీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లకు అప్లయ్ చేసే అర్హత కోల్పోతారు.
ఒకే అభ్యర్థి పలుమార్లు రిజిస్ట్రేషన్ చేసుకోవడం లేదంటే డేటాను తారుమారు చేయడానికి ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అభ్యర్థులు ఏప్రిల్ 10లోపు తమ ఓటీఆర్ వివరాలను అధికారిక వెబ్సైట్ www.tgpsc.gov.in ద్వారా సరిచేసుకోవాలని సూచించారు.
