సైబర్ నేరగాళ్లు కొట్టేసిన రూ.10 లక్షలను తిరిగి దక్కించుకున్న వృద్ధురాలు.. బాధితురాలి వీడియో పోస్ట్ చేసిన సజ్జనార్

పోలీసులం మాట్లాడుతున్నామని, మనీలాండరింగ్ కేసు నమోదయిందని చెప్పగానే భయపడిపోయి..

సైబర్ నేరగాళ్లు కొట్టేసిన రూ.10 లక్షలను తిరిగి దక్కించుకున్న వృద్ధురాలు.. బాధితురాలి వీడియో పోస్ట్ చేసిన సజ్జనార్

Cyber Crimes

పోలీసుల పేరిట, దర్యాప్తు సంస్థల అధికారుల పేరిట కేటుగాళ్లు సామాన్య ప్రజలకు ఫోన్లు చేస్తూ బెదిరిస్తున్నారు. ‘మీపై కేసు నమోదైంది.. మీరు డ్రగ్స్ అమ్ముతున్నట్లు మాకు తెలిసింది. మీ బ్యాంకు అకౌంటు నుంచి డబ్బులు పంపిస్తే కొద్దిసేపటి తర్వాత మళ్లీ వాటిని మీకు తిరిగి పంపిస్తాం. లేదంటే జైలుకు వెళ్లాల్సి ఉంటుంది’ అంటూ భయపెడుతూ మోసాలకు పాల్పడుతున్నారు. ఎన్నో రకాల మాటలు చెప్పి నమ్మించి డబ్బు రాబట్టుకుంటున్నారు.

ఆ కేటుగాళ్ల మాటలు నమ్మామో ఎంత వీలైతే అంత డబ్బు కొట్టేస్తారు. ఒకవేళ మోసపోతే వెంటనే 1930కి కాల్ చేసి ఫిర్యాదు చేయాలి. ఈ విషయాన్నే టీజీఆర్టీసీ ఎండీ సజ్జనార్ తన ఎక్స్ ఖాతా ద్వారా వివరించి చెప్పారు. ఇటీవల సైబర్ నేరగాళ్ల మాటలు నమ్మి మోసపోయిన ఓ వృద్ధురాలు తిరిగి తన డబ్బును ఎలా వెనక్కి రాబట్టుకుందో చెప్పారు.

‘పోలీసులం మాట్లాడుతున్నామని, తనపై మనీలాండరింగ్ కేసు నమోదయిందని చెప్పగానే భయపడిపోయి.. ఈ 68 ఏళ్ల బాధితురాలు సైబర్ నేరగాళ్లకు రూ.10 లక్షలను చెల్లించారు. మోసపోయానని బాధపడకుండా.. వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకి ఆమె ఫిర్యాదు చేశారు.

తక్షణమే సైబర్ నేరగాళ్ల బ్యాంక్ ఖాతాలను ఫ్రీజ్ చేసి బాధితురాలి డబ్బును పోలీసులు వెనక్కి రప్పించారు. సైబర్ నేరాల్లో గోల్డెన్ అవర్ ఎంతో కీలకం. మోసపోయిన వెంటనే స్థానిక పోలీసులను గానీ, 1930కి కాల్ చేసి ఫిర్యాదు చేయండి’ అని సజ్జనార్ పేర్కొన్నారు.

Video: టీమిండియా పరేడ్.. ఇన్ని వేల కిలోల చెత్తనా? చెప్పులు, కవర్లు, ప్లాస్టిక్ బాటిళ్లు