Video: టీమిండియా పరేడ్.. ఇన్ని వేల కిలోల చెత్తనా? చెప్పులు, కవర్లు, ప్లాస్టిక్ బాటిళ్లు

గురువారం రాత్రి 11.30 గంటలకు ప్రారంభమైన స్వచ్ఛత డ్రవైర్ శుక్రవారం ఉదయం 8 గంటలకు..

Video: టీమిండియా పరేడ్.. ఇన్ని వేల కిలోల చెత్తనా? చెప్పులు, కవర్లు, ప్లాస్టిక్ బాటిళ్లు

టీమిండియా గురువారం టీ20 ప్రపంచ కప్ విజయోత్సవ పరేడ్‌ను నిర్వహించిన విషయం తెలిసిందే. అనంతరం బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ – బీఎంసీ మెరైన్ డ్రైవ్ నిర్వహించింది. అక్కడ 11,000 కిలోల వ్యర్థాలు లభ్యమయ్యాయి.

ఇంత చెత్త వేసిన అభిమానులపై విమర్శలు వస్తున్నాయి. పెద్ద ఎత్తున చెప్పులు, కవర్లు, ప్లాస్టిక్ బాటిళ్లు అక్కడ కనపడ్డాయి. చెత్తకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

గురువారం సాయంత్రం మెరైన్ డ్రైవ్ నుంచి వాంఖడే స్టేడియం వరకు పరేడ్‌ నిర్వహించారు. విజయోత్సవ పరేడ్ తర్వాత బీఎంసీ ఆ ప్రాంతాన్ని శుభ్రం చేసింది. వేస్ట్ మేనేజ్‌మెంట్ విభాగానికి చెందిన 100 మంది సిబ్బందితో పాటు కొన్ని స్వచ్ఛంద సంస్థల కార్మికులు స్వచ్ఛత డ్రైవ్‌లో పాల్గొన్నారు.

గురువారం రాత్రి 11.30 గంటలకు ప్రారంభమైన స్వచ్ఛత డ్రవైర్ శుక్రవారం ఉదయం 8 గంటలకు ముగిసింది. ఐదు జీపులు, రెండు వాహనాల్లో చెత్తను సేకరించారు. ముంబైలో పరేడ్ వేళ తొక్కిసలాట వంటి ఘటన కూడా చోటుచేసుకుంది. కొందరికి గాయాలయ్యాయి.

Also Read : రిటైర్‌మెంట్ పై బుమ్రా కీల‌క వ్యాఖ్య‌లు.. ఇప్పుడే మొద‌లు పెట్టా..