అందుకే చంపేశాడు..! అమెరికాలో తెలుగమ్మాయి నిఖిత దారుణ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి..

"అర్జున్ శర్మ గతంలో నా కూతురి రూమ్‌మెట్‌గా ఉన్నాడు. అందరినీ డబ్బులు అడిగి తీసుకునే వాడు" అని నిఖిత తండ్రి చెప్పారు.

అందుకే చంపేశాడు..! అమెరికాలో తెలుగమ్మాయి నిఖిత దారుణ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి..

Nikita, Arjun Sharma(Image Credit To Original Source)

Updated On : January 5, 2026 / 4:12 PM IST
  • డబ్బులు తీసుకుని ఇవ్వలేదు, అడిగితే చంపేశాడు
  • ఆమె స్నేహితులు ఇదే చెబుతున్నారు
  • పలు వివరాలు చెప్పిన నిఖిత తండ్రి ఆనంద్

Nikitha Godishala: అమెరికాలో తెలుగమ్మాయి నిఖిత గోడిశాల ( 27)ను ఆమె మాజీ ప్రియుడు అర్జున్ శర్మ దారుణంగా హత్య చేసిన కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

నిఖిత తండ్రి ఆనంద్ మీడియాతో మాట్లాడుతూ పలు వివరాలు తెలిపారు. “చివరిగా హ్యాపీ న్యూ ఇయర్ డాడీ అని చెప్పింది. నాలుగేళ్ల క్రితం నా కూతురు అమెరికా వెళ్లింది. నా కూతురు నిఖితను అర్జున్ శర్మ అనే యువకుడు హత్య చేశాడు. అర్జున్ శర్మ గతంలో నా కూతురి రూమ్‌మెట్‌గా ఉన్నాడు. అందరినీ డబ్బులు అడిగి తీసుకునే వాడు.

నా కూతురి దగ్గర నుంచి కూడా డబ్బులు తీసుకున్నాడు అని అంటున్నారు. ఆ డబ్బులు అడగడానికి అర్జున్ దగ్గరికి నిఖిత వెళ్లినట్లు ఆమె స్నేహితులు చెబుతున్నారు. ఆ తర్వాత నిఖితను హత్య చేసి, ఆమె అదృశ్యమైందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అక్కడి నుండి ఇండియాకి పారిపోయి వచ్చాడు.

నాలుగు సంవత్సరా ల క్రితం అమెరికాకు నా కూతురు చదువుకోడానికి వెళ్లింది.. కొన్ని నెలల నుంచి జాబ్ చేస్తుంది. చివరిగా డిసెంబరు 31న ఫోన్ చేసి న్యూ ఇయర్ విషెస్ చెప్పింది. అదే చివరి మాట. నా కూతురికి జరిగిన అన్యాయం ఎవరికీ జరగకూడదు. అధికారులు నా కూతురి మృతదేహాన్ని ఇండియాకి తీసుకొచ్చే ఏర్పాట్లు చేయాలని కోరుతున్నాను” అని అన్నారు.

4,500 డాలర్లు అప్పుగా ఇచ్చిన నిఖిత
అర్జున్ శర్మ 4,500 డాలర్లు నిఖితను అప్పు అడిగినట్లు పోలీసులు, ఆమె కజిన్ సరస్వతి చెప్పారు. కొంతకాలం తర్వాత 3,500 డాలర్లు నిఖితకు అర్జున్ శర్మ తిరిగి ఇచ్చాడని అంటున్నారు. మిగతా వెయ్యి డాలర్లు కూడా ఇచ్చేయాలని అర్జున్‌ను నిఖిత అడిగినట్టు తెలుస్తోంది. దీంతో ఆమె నుంచి 3,500 డాలర్లు అక్రమంగా ట్రాన్స్‌ఫర్‌ చేసుకుని, ఆమెను అర్జున్ శర్మ హత్య చేసినట్లు సమాచారం.

అపార్ట్‌మెంట్‌లో దారుణ హత్య
మేరీల్యాండ్‌లోని ఎలికాట్ సిటీలో ఉంటున్న నిఖిత అదృశ్యమైందని ఆమె మాజీ ప్రియుడు అర్జున్ శర్మ ఫిర్యాదు చేసి, అదే రోజు భారతదేశానికి ఎస్కేప్ అయ్యాడు. అర్జున్ శర్మను తమిళనాడులో ఇంటర్ పోల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డిసెంబర్ 31న నిఖితను అర్జున్ హత్య చేశాడు.

నిఖిత డిసెంబర్ 31 నుంచి అదృశ్యమవడంతో సోషల్ మీడియాలో ఆమె స్నేహితులు దీనిపై పోస్ట్‌లు పెడుతున్నారు. హోవార్డ్ కౌంటీ పోలీసులు దర్యాప్తులో అర్జున్ శర్మ హత్య చేసినట్లు నిర్ధారించారు. జనవరి 2న హోవార్డ్ కౌంటీ పోలీసులు నిఖిత ఆచూకీ కనుగొన్నారు.

అర్జున్ శర్మకు చెందిన కొలంబియా అపార్ట్‌మెంట్‌లో నిఖిత కత్తిపోట్లతో హత్యకు గురైంది. అక్కడే ఆమె మృతదేహం లభ్యమైంది. అర్జున్‌ మీద అనుమానంతో అతడి అపార్ట్‌మెంట్‌లో పోలీసులు తనిఖీ చేయడంతో ఈ విషయం బయటపడింది. లిఖిత కుటుంబ సభ్యులతోభారత రాయబారి కార్యాలయం సంప్రదింపులు జరుపుతోంది.

త్వరితగతిన నిఖిత మృతదేహాన్ని హైదరాబాద్ రప్పించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. లాలాగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీ మిత్ర ప్రిన్స్ అపార్ట్‌మెంట్‌లో గత కొంతకాలంగా నిఖిత పేరెంట్స్ నివాసం ఉంటున్నారు. నిఖిత దారుణ హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.