Robot Teacher in Hyd : స్కూల్ టీచర్ గా రోబోలు..దేశంలోనే తొలిసారి హైదరాబాద్ స్కూల్లో ప్రయోగం

హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు స్కూల్లో రోబోలు టీచర్లుగా పాఠాలు చెబుతున్నాయి. దేశంలోనే తొలిసారిగి రోబోలను టీచర్లుగా ఏర్పాటుచేసింది ఓ ప్రైవేటు స్కూల్.

Robot Teacher in Hyd : స్కూల్ టీచర్ గా రోబోలు..దేశంలోనే తొలిసారి హైదరాబాద్ స్కూల్లో ప్రయోగం

Robot Teacher In Hyderabad Private School (1)

Updated On : July 28, 2022 / 4:41 PM IST

Robot teacher in Hyderabad private school : టెక్నాలజీ పరుగులు పెడుతోంది. మనుషులు చేసే పనులు రోబోలు చకచకా చేసేస్తున్నాయి. మనుషులతో మాట్లాడుతున్నాయి కూడా. ప్రశ్నలకు సమాధానలు కూడా చెబుతున్నాయి. అటువంటి రోబో మనిషి చేసే పనులన్నీ చేసేస్తే ఇక మనిషికి ఉద్యోగ, ఉపాధులు తగ్గిపోతాయా? అంటే నిజమేనేమో అనిపిస్తోంది. ఇప్పటికే కొన్ని హోటల్స్ రోబోలతో సర్వ్ చేయించి వ్యాపారాన్ని పెంచుకుంటున్నాయి. కానీ టెక్నాలజీ డెవలప్ మెంట్ లో ఇదో కొత్త ప్రయోగం అనుకున్నా.. సర్వర్ల పొట్టకొట్టినట్లేనని అనుకోవచ్చు. అవే రోబోలు పిల్లలకు పాఠాలు చెప్పేస్తే ఇక టీచర్ల పరిస్థితి ఏంటీ? అనే ప్రశ్న వస్తోంది. ఎందుకంటే హైదరాబాద్ లో రోబోలతో పాఠాలు చెప్పించే వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది ఓ ప్రైవేట్ స్కూల్.

హైదరాబాద్ లోని ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్ కు వెళితే క్లాసురూముల్లో రోబోలు పలకరిస్తాయి. పక్కన టీచర్ కూడా ఉంటారు. విద్యార్థులు అడిగే సందేహాలను రోబో తీరుస్తుంది. కృత్రిమ మేధ (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్/ఏఐ) సాయంతో ఈ రోబోలు టీచర్ గా మారాయి. స్కూల్లో రోబో టీచర్ ప్రవేశపెట్టామని దేశంలోనే తొలిసారిగా ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్ యాజమాన్యం తెలిపింది. ఈగల్ రోబోల గురించి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి సైతం వివరించడం గమనించాల్సిన విషయం.

హైదరాబాద్, బెంగళూరు, పుణెలో ఉన్న మూడు విద్యా కేంద్రాల్లోనూ ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్ రోబోలను రంగంలోకి దింపింది. ఐదు నుంచి 11వ క్లాసులకు ఈ రోబోలు పాఠాలు కూడా చెబుతాయి. 30కు పైగా భాషల్లో పాఠాలు చెప్పగలవు ఈ రోబోలు. అంతేకాదు విద్యార్థులకు వచ్చే డౌట్స్ ని కూడా చక్కగా క్లియర్ చేయగలవు. రోబో చెప్పే పాఠాలను విద్యార్థులు మొబైల్స్, ల్యాప్ టాప్ ల నుంచి యాక్సెస్ చేసుకునే ఫెసిలిటీ కూడా ఉంది.