Telangana High Court : తెలంగాణ హైకోర్టులో ఆగస్టు 9 నుంచి పాక్షికంగా ప్రత్యక్ష విచారణ

తెలంగాణ హైకోర్టులో ఆగస్టు 9 నుంచి పాక్షికంగా కేసుల ప్రత్యక్ష విచారణ ప్రారంభం కానుంది. దీన్ని సెప్టెంబర్ 9 వరకు కొనసాగించాలని హైకోర్టు నిర్ణయించింది.

Telangana High Court : తెలంగాణ హైకోర్టులో ఆగస్టు 9 నుంచి పాక్షికంగా ప్రత్యక్ష విచారణ

High Court

Updated On : July 31, 2021 / 5:41 PM IST

Telangana High Court : తెలంగాణ హైకోర్టులో ఆగస్టు 9 నుంచి పాక్షికంగా కేసుల ప్రత్యక్ష విచారణ ప్రారంభం కానుంది. దీన్ని సెప్టెంబర్ 9 వరకు కొనసాగించాలని హైకోర్టు నిర్ణయించింది. ప్రతి రోజు ఒక ధర్మాసనం, ఒక సింగిల్ బెంచ్ కేసులను ప్రత్యక్షంగా విచారించనున్నాయి. అయితే వ్యాక్సిన్ వేయించుకున్న న్యాయవాదులనే కోర్టులోకి అనుమతించనున్నారు.

వ్యాక్సిన్ వేసుకున్న న్యాయవాదులకే ప్రత్యక్ష విచారణకు హైకోర్టు అనుమతించింది. అంతేకాదు కేసు ఉన్న లాయర్స్ మాత్రమే కోర్టుకు రావాలని హైకోర్టు స్పష్టం చేసింది. లాయర్లు, సిబ్బంది తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలను పాటించాలని ఆదేశించింది. ఆగస్టు 8 వరకు ఆన్ లైన్ లోనే కేసుల విచారణ కొనసాగనుంది.

కరోనా మహమ్మారి విజృంభణ కాలంలో హైకోర్టులో కేసుల ప్రత్యక్ష విచారణ ఆపేసిన విషయం తెలిసిందే. అయితే తెలంగాణ హైకోర్టులో ఆగస్టు 9 నుంచి పాక్షికంగా కేసుల ప్రత్యక్ష విచారణ ప్రారంభం కాబోతోంది. దీన్ని సెప్టెంబర్ 9 వరకు కొనసాగించాలని హైకోర్టు నిర్ణయించింది.