Hyderabad : భాగ్యనగరంలో పాములు.. వర్షంలో చూసుకుని వెళ్లండి..

Hyderabad : భాగ్యనగరంలో పాములు.. వర్షంలో చూసుకుని వెళ్లండి..

Hyderabad

Updated On : July 6, 2023 / 6:38 PM IST

Hyderabad : మొన్నటి దాకా భాగ్యనగరం ఎండలతో విలవిలాడింది. ఇప్పుడిప్పుడే వర్షాలు పలకరిస్తున్నాయ్. వర్షం పడగానే రోడ్లపైకి పాములు రావడం సహజమే. అయితే ఎప్పుడూ లేనంతగా హైదరాబాద్ రోడ్లపైకి పాములు వస్తున్నాయట. జాగ్రత్తగా ఉండమని అధికారులు సూచిస్తున్నారు.

Hyderabad University MCA : యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్ లో ఎంసీఏ ప్రోగ్రామ్ లో ప్రవేశాలు

హైదరాబాద్‌ను వర్షాలు పలకరించాయి. చినుకు పడగానే ఓ వైపు మ్యాన్ హోల్స్, విద్యుత్ స్తంభాలు, వైర్లతో జాగ్రత్తగా ఉండాలని ప్రజలు భయపడుతుంటే మరోవైపు ఎప్పుడూ లేనంతగా పాములు రోడ్లపైకి వస్తున్నాయి. హైదరాబాద్‌లో గత నాలుగు రోజుల్లో వివిధ జాతులకు చెందిన 250 పాములను అటవీ అధికారులు పట్టుకున్నారని తెలుస్తోంది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

Hyderabad Huge Scam : హైదరాబాద్ లో మరో భారీ మోసం.. రూ.40 కోట్ల స్కామ్ ను బయటపెట్టిన ఐటీ

భారీ వర్షాలకు చెత్త, నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతాల్లో నివాసం ఉండే పాములు వర్షాలకు బయటకు వస్తున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా వర్షాకాలం ఇటు మ్యాన్ హోల్స్, విద్యుత్ తీగలు.. మరోవైపు పాముల బారి నుంచి జాగ్రత్తగా ఉండాల్సిందే.