Hyderabad Huge Scam : హైదరాబాద్ లో మరో భారీ మోసం.. రూ.40 కోట్ల స్కామ్ ను బయటపెట్టిన ఐటీ

హైదరాబాద్, విజయవాడల్లోని పలు ఐటీ కంపెనీల్లో సోదాలు చేశారు. ఐటీ శాఖనే బురిడి కొట్టించిన కంపెనీల వ్యక్తులపై కేసులు నమోదు చేసేందుకు రంగం సిద్ధం చేసింది.

Hyderabad Huge Scam : హైదరాబాద్ లో మరో భారీ మోసం.. రూ.40 కోట్ల స్కామ్ ను బయటపెట్టిన ఐటీ

Hyderabad Scam

Updated On : June 29, 2023 / 3:13 PM IST

Income Tax Department : హైదరాబాద్ లో మరో భారీ మోసం వెలుగు చూసింది. ఆదాయపు పన్ను శాఖ పన్ను రీఫండ్ కుంభకోణాన్ని బట్టబయలు చేసింది. 40 కోట్ల రూపాయల స్కామ్ ను ఐటీ అధికారులు బయటపెట్టారు. 8 మంది ట్యాక్స్ కన్సల్టెంట్‌లు, రైల్వేలు, పోలీసు శాఖలకు చెందిన పలువురు ఉద్యోగులు పాత్ర ఉన్నట్లు గుర్తించారు.

హైదరాబాద్, విజయవాడల్లోని పలు ఐటీ కంపెనీల్లో సోదాలు చేశారు. ఐటీ శాఖనే బురిడి కొట్టించిన కంపెనీల వ్యక్తులపై కేసులు నమోదు చేసేందుకు రంగం సిద్ధం చేసింది. ముందస్తుగా కంపెనీల వ్యక్తులకు నోటీసులు ఇవ్వనున్నట్లు ఐటీ అధికారులు తెలిపారు. అదనపు కన్సల్టెంట్‌లు, ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులను గుర్తించారు.

Constable Ramaiah Death : ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ రామయ్య మృతిపై కేసు నమోదు

నిజాంపేట్, ఎల్బీనగర్, వనస్థలిపురంలోని పలు ప్రాంతాల్లో ఐటీ సోదాలు జరిగాయి. ఈ స్కామ్ లో కన్సల్టెంట్లు, ఉద్యోగులను ఉన్నారని ఐటీ అధికారులు తెలిపారు. కన్సల్టెంట్‌లు, ఏజెంట్ల రీఫండ్ మొత్తంపై 10% కమీషన్ కోసం రిటర్న్‌లను దాఖలు చేశారు. 2017లో ఇదే తరహా మోసాన్ని ఐటీ గుర్తించింది.

200 మంది సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు తమ కుటుంబ సభ్యులలో ఉన్న వైకల్యాలు మరియు దీర్ఘకాలిక అనారోగ్యాల ద్వారా తప్పుడు రీఫండ్‌లను క్లెయిమ్ చేశారని ఐటీ తెలిపింది. ఉద్యోగులకు అర్హత లేకపోయినా కన్సల్టెంట్‌లు బోగస్ డాక్యుమెంట్‌లను రీఫండ్ క్లేయిమ్ చేశారని పేర్కొంది.