Hyderabad University MCA : యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్ లో ఎంసీఏ ప్రోగ్రామ్ లో ప్రవేశాలు
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి గుర్తింపు పొందిన విశ్వ విద్యాలయం నుండి మేథమెటిక్స్ , స్టాటిక్స్ ను ఒక సబ్జెక్టుగా కలిగి డిగ్రీ ఉత్తీర్ణులైన విద్యార్ధులు దరఖాస్తు చేసుకోవచ్చు.

Hyderabad University MCA
Hyderabad University MCA : యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్ (యుఓహెచ్) లో ఎంసీఏ ప్రోగ్రామ్ లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతున్నారు. మొత్తం 42 సీట్లను నీమ్ సెట్ 2023లో వచ్చిన స్కోర్ ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. 42 సీట్లలో 16 సీట్లు జనరల్ అభ్యర్ధులకు, 11 సీట్లు ఓబీసీ అభ్యర్ధులకు, ఎస్టీలకు 3, ఎస్సీలకు 6, దివ్యాంగులకు 2 సీట్లు, ఈడబ్ల్యూఎస్ అభ్యర్ధులకు 4 సీట్లు కేటాయించనున్నారు.
READ ALSO : Dried Lemon benefits : ఎండిపోయిన నిమ్మకాయలు పారేయకండి.. ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి గుర్తింపు పొందిన విశ్వ విద్యాలయం నుండి మేథమెటిక్స్ , స్టాటిక్స్ ను ఒక సబ్జెక్టుగా కలిగి డిగ్రీ ఉత్తీర్ణులైన విద్యార్ధులు దరఖాస్తు చేసుకోవచ్చు. బీఈ, బీటెక్, పూర్తి చేసిన వారితోపాటుగా, ఓపెన్ యూనివర్శిటీ లో మూడేళ్ళ, బీఎస్సీ, బీఎస్సీ ఆనర్స్, బీసీఏ, బీఐటీ డిగ్రీ ఉత్తీర్ణులైన వారుకు కూడా అర్హులే. ప్రధమ శ్రేణి ఉత్తీర్ణత తప్పనిసరికాగా, నిమ్ సెట్ 2023లో అర్హుత సాధించి ఉండాలి.
READ ALSO : Natural Farming : గో ఆధారిత ప్రకృతి వ్యవసాయంతో.. మూడు రెట్ల ఆదాయం పొందుతున్న రైతు
అభ్యర్ధులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. జనరల్ అభ్యర్ధులకు దరఖాస్తు ఫీజుగా 600, ఈ డబ్య్లుఎస్ అభ్యర్ధులకు 550రూ. , ఓబీసీ అభ్యర్ధులకు 400, దివ్యాంగులు, ఎస్సీ,ఎస్టీ అభ్యర్ధులకు 275రూ గా నిర్ణయించారు. ఆన్ లైన్ దరఖాస్తులకు చివరి తేదిగా జులై 14, 2023 ను నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; uohyd.ac.in పరిశీలించగలరు.