Onion : ఒక్కరోజే రూ.7 పెరిగిన ఉల్లిగడ్డ ధర

ఉల్లి ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. హైదరాబాద్‌ మలక్‌పేట వ్యవసాయ మార్కెట్‌లో శుక్రవారం కిలో ఉల్లి ధర ఏకంగా రూ.7లకు పెరిగింది. ఒక్కరోజు 1,680 క్వింటాళ్ల దిగుమతి తగ్గడంతో ధరలు పెరిగాయి.

Onion : ఒక్కరోజే రూ.7 పెరిగిన ఉల్లిగడ్డ ధర

Onion

Updated On : September 25, 2021 / 10:26 AM IST

onion price in malakpet market : ఉల్లి ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. హైదరాబాద్‌లోని మలక్‌పేట వ్యవసాయ మార్కెట్‌లో శుక్రవారం కిలో ఉల్లిగడ్డ ధర ఏకంగా రూ.7లకు పెరిగింది. గ్రేడ్‌-1 మేలు రకం ఉల్లిగడ్డ క్వింటాకు రూ.2,700, మోడల్‌ రకం రూ.1,800, గ్రేడ్‌-2 మేలు రకం రూ.1,600లు, మోడల్‌ రకం రూ.1,200 ధర పలికింది.

జోరుగా కురుస్తున్న వర్షాల కారణంగా తెలంగాణలోని గద్వాల, ఏపీలోని కర్నూలులో ఉల్లి పంట దెబ్బతినడం, ఈనామ్‌ విధానానికి వ్యతిరేకంగా ఏపీలో జరుగుతున్న ఆందోళనలు, మహారాష్ట్రలో నిల్వలు తగ్గిపోవడం ఉల్లిగడ్డ ధరలు పెరగడానికి కారణమని వ్యాపారులు చెప్తున్నారు.

Gerbera Farming: ఒక్కసారి నాటితే మూడేళ్ల వరకూ ఆదాయం.. జెర్బరా ప్రత్యేకత అదే

తెలంగాణతోపాటు మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ నుంచి మలక్‌పేట మార్కెట్‌కు గురువారం 13,080 క్వింటాళ్ల ఉల్లిగడ్డ రాగా, శుక్రవారం అది 11,400 క్వింటాళ్లకు పడిపోయింది. ఒక్కరోజు 1,680 క్వింటాళ్ల దిగుమతి తగ్గడంతో ధరలు పెరిగాయని మలక్‌పేట వ్యవసాయ మార్కెట్‌ డిప్యూటీ డైరెక్టర్ దామోదర్‌ పేర్కొన్నారు.