Telangana govt : వెమ్ టెక్నాలజీతో ఎంవోయూ కుదుర్చుకున్న తెలంగాణ ప్రభుత్వం

జహీరాబాద్ లో ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ సిస్టమ్ ఫెసిలిటీ కోసం వెమ్ టెక్నాలజీతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంవోయూ కుదుర్చుకుంది. మంత్రి కేటీఆర్ వెమ్ టెక్నాలజీకి ధన్యవాదములు తెలిపారు.

Telangana govt : వెమ్ టెక్నాలజీతో ఎంవోయూ కుదుర్చుకున్న తెలంగాణ ప్రభుత్వం

Ktr

Updated On : October 24, 2021 / 8:54 PM IST

Telangana MoU with WEM technology : జహీరాబాద్ లో ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ సిస్టమ్ ఫెసిలిటీ కోసం వెమ్ టెక్నాలజీతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంవోయూ కుదుర్చుకుంది. హైదరాబాద్ లోని హోటల్ తాజ్ కృష్ణలో జరిగిన ఈ ఒప్పంద కార్యక్రమంలో ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, నీతి అయోగ్ మెంబర్ డాక్టర్ వీ.కే. సరస్వథ్, DRDO చైర్మన్ సతీష్ రెడ్డి, ఐటీ సెక్రెటరీ జయేష్ రంజన్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణలో వేయి కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్న వెమ్ టెక్నాలజీకి ధన్యవాదాలు తెలిపారు. ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ సిస్టమ్ ఫెసిలిటీ వల్ల రెండు వేల మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. వెమ్ టెక్నాలజీ ఎం.డి. వెంకటరాజు… స్టార్టప్ సంస్థలకి, ఎమ్.ఎస్.ఎమ్.ఇ. లకు ఆదర్శంగా నిలుస్తున్నాడని చెప్పారు.

Etala Rajender : కుట్రపూరితంగా, నీచపు ఆలోచనతో నన్ను బయటకు పంపారు : ఈటల

తెలంగాణలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్న ప్రతి కంపెనీకి, టాలెంట్ ఉన్న వివిధ స్టార్టప్ సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని, చేయూతనిస్తుందని తెలిపారు. తెలంగాణ డిఫెన్స్, ఎరో స్పేస్ రంగంలో వెమ్ కొత్త చరిత్ర సృష్టిస్తుందన్న నమ్మకం ఉందన్నారు.

దేశం గర్వించదగ్గ సంస్థ వెమ్ టెక్నాలజీ కొనియాడారు. డిఫెన్స్ రంగంలో వెమ్ టెక్నాలజీ అందిస్తున్న సేవలకు ధన్యవాదాలు తెలిపారు. జహీరాబాద్ లో స్కిల్ సెంటర్ ని కూడా ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు.