Etala Rajender : కుట్రపూరితంగా, నీచపు ఆలోచనతో నన్ను బయటకు పంపారు : ఈటల

ఇన్నేళ్ల సోపతిలో నేను మంచోన్నో.. చెడ్డోన్నో కేసీఆర్ కు తెలియదా? అని బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు. కావాలనే కుట్రపూరితంగా, నీచపు ఆలోచనతో తనను టీఆర్ఎస్ నుంచి బయటకు పంపారని అన్నారు.

Etala Rajender : కుట్రపూరితంగా, నీచపు ఆలోచనతో నన్ను బయటకు పంపారు : ఈటల

Etala

Etala Rajender criticized CM KCR : ఇన్నేళ్ల సోపతిలో నేను మంచోన్నో.. చెడ్డోన్నో కేసీఆర్ కు తెలియదా? అని బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు. కావాలనే కుట్రపూరితంగా, నీచపు ఆలోచనతో తనను టీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు పంపారని ఆవేదన వ్యక్తం చేశారు. హుజురాబాద్ లో తాను వచ్చిన తర్వాతే డెవలప్ మెంట్ జరిగిందన్నారు. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం నర్సింగాపూర్ లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఈటల ఈ వ్యాఖ్యలు చేశారు.

డీజిల్, పెట్రోలుపై పన్నులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేస్తాయని తెలిపారు. గ్యాస్ సిలిండర్ పై వేసే 5 శాతం పన్నులో 22.67 రూపాయల చొప్పున కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటాయని చెప్పారు. అంతర్జాతీయ మార్కెట్ కు అనుగుణంగా గ్యాస్, డీజిల్, పెట్రోలు ధరలుంటాయని పేర్కొన్నారు. సామాన్యులపై భారం పడుతుందనుకున్నప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి తగ్గించాలన్నారు. కానీ ఈ అంశాన్ని రాజకీయాలకు వాడుకోవడం నీచమన్నారు.

Harish Rao : ధరలు పెంచి సామాన్యులను పీడిస్తోన్న బీజేపీకి ఎందుకు ఓటేయాలి : మంత్రి హరీశ్‌ రావు

రాష్ట్ర ప్రభుత్వం పెట్రోలుపై 36 శాతం పన్ను విధిస్తోందని చెప్పారు. మీరిచ్చే స్కీమ్ లు అన్నీ ఇలాంటి పన్నుల ద్వారా వచ్చే డబ్బుతోనే కదా అని అన్నారు. మద్యం మీదనే రాష్ట్రానికి 30 వేల కోట్ల ఆదాయం వస్తోందని తెలిపారు. కానీ ఫింఛన్ల కోసం ఇచ్చేది కేవలం 9 వేల కోట్లు మాత్రమేనని పేర్కొన్నారు. కల్యాణలక్ష్మికి ఇచ్చేది 1500 కోట్లు అని చెప్పారు. అదేపనిగా గ్యాస్, డీజిల్ ధరలను ప్రచారాలు చేస్తున్నారని అసహనం వ్యక్తం చేస్తున్నారు. మన్మోహన్ ప్రధానిగా ఉన్నప్పుడు… ఏ రోజు ధరలు ఆరోజే ఉండేలా అంతర్జాతీయ మార్కెట్ కు అనుగుణంగా ఉండాలని నిర్ణయించారని.. అప్పుడు కేసీఆర్ కూడా కేంద్ర మంత్రిగా ఉన్నారనుకుంటానని చెప్పారు.

కేసీఆర్ పద్దెనెమిదిన్నర సంవత్సరాలు తమ్ముడిగా, మిత్రుడిగా, శిష్యుడిగా.. ఏ పని చెప్పినా.. శభాష్ అనిపించుకునేలా తాను పని చేశానని చెప్పారు. ఏ పదవి ఇచ్చినా దానికి వన్నె తెచ్చేలా పనిచేశానని పేర్కొన్నారు. కానీ పద్దెనెమిదిన్నర ఏళ్ల తర్వాత తనను ఎందుకు పంపించారో చెబుతారా అని నిలదీశారు. వెన్నుపోటు పొడిచింది మీరా… నేనా? అని ప్రశ్నించారు.

T20 World Cup 2021: ఇండియా బ్యాటింగ్… ఫైనల్ టీమ్స్ ఇవే

బయటకు పంపినా బాధపడలేదు… కానీ.. కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, వినోద్ కుమార్ లాంటి వాళ్లంతా.. తనను రాజీనామా చేయాలని డిమాండ్ చేశారని పేర్కొన్నారు. గౌరవం లేని చోట ఉండకూడదని.. ఇజ్జత్ లేని బతుకు వద్దని పదవికి రాజీనామా చేసి వచ్చానని స్పష్టం చేశారు. మీరిచ్చిన పదవే అయినా.. పూలమ్మిన చోట.. కట్టెలమ్మవద్దని ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వచ్చానని తెలిపారు. ఎన్ని వేల కోట్లైనా ఖర్చు చేసి.. తన ముఖం అసెంబ్లీలో కనిపించకుండా చూడాలని ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు.

2 వేల కోట్ల రూపాయల భూములమ్మి తనను ఓడించేందుకు దళిత బంధు తెచ్చారని పేర్కొన్నారు. దళితబంధు ఆపారని తన మీద దొంగ ఉత్తరం సృష్టించారని మండిపడ్డారు. తాను దళితబంధు ఆపుతానా? తాను హుజురాబాద్ లోని ప్రతి కుటుంబంలోనూ సభ్యున్ని అని అన్నారు. ఈ ప్రాంత ప్రజలకు ప్రేమను పంచిన వాన్ని.. తనను ఆశీర్వదించాలని కోరారు. తనపై ఎవరో ఎందుకు..నీవే వచ్చి పోటీ చేయమని కేసీఆర్ ను అడిగినట్లు తెలిపారు.

T20 World Cup 2021: పాక్‌తో టీమిండియా మ్యాచ్‌కు ఫ్రీ టికెట్లు

2004లో తాను అనామకున్ని కావచ్చు… కానీ ఇప్పుడు తెలంగాణ ప్రజల కోసం కొట్లాడే పులిబిడ్డననని చెప్పారు. అక్రమంగా సంపాదించిన 350 కోట్లు ఖర్చు చేశారని..70 కోట్ల రూపాయల లిక్కర్ హుజురాబాద్ లో పంచారని విమర్శించారు. మీరు ఎంత పంచినా.. ఈసారి మీకు మా ప్రజలు ఓట్లు వేయరు… మీకు డిపాజిట్ కూడా రాదన్నారు. కానీ ఇన్ని డబ్బులు ఖర్చు చేసే సంప్రదాయం మంచిది కాదని స్పష్టం చేశారు.

ఇంత ఖర్చుతో  పోటీ పడి ఎన్నికల్లో పోటీ చేయడానికి ఎవరైనా వస్తారా అని ప్రశ్నించారు. అంటే టాటా, బిర్లా, అంబానీలాంటి వాళ్లు వచ్చి పోటీ చేసి.. సంపాదించుకోవాలన్నారు. అలాంటి వాళ్లు పేదల కష్టాలకు స్పందిస్తారా అని అన్నారు. కేసీఆర్ డబ్బుమయం చేశారు…ఆ డబ్బుకి బుద్ధి చెప్పాలన్నారు. 30వ తేదీ హుజూరాబాద్ నుండే కేసీఆర్ అహంకారాన్ని అణచివేయాలని పిలుపునిచ్చారు.