Harish Rao : ధరలు పెంచి సామాన్యులను పీడిస్తోన్న బీజేపీకి ఎందుకు ఓటేయాలి : మంత్రి హరీశ్‌ రావు

నిత్యావసర వస్తువుల ధరలు పెంచిన బీజేపీకి ప్రజలు ఎందుకు ఓటేయాలని తెలంగాణ మంత్రి హరీశ్‌ రావు ప్రశ్నించారు. మాచాన్‌పల్లిలో ఏర్పాటు చేసిన టీఆర్‌ఎస్‌ ధూంధాం కార్యక్రమంలో పాల్గొన్నారు.

Harish Rao : ధరలు పెంచి సామాన్యులను పీడిస్తోన్న బీజేపీకి ఎందుకు ఓటేయాలి : మంత్రి హరీశ్‌ రావు

Harish Rao

Harish Rao angry with the BJP : నిత్యావసర వస్తువుల ధరలు పెంచిన బీజేపీకి ప్రజలు ఎందుకు ఓటేయాలని తెలంగాణ మంత్రి హరీశ్‌ రావు ప్రశ్నించారు. హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని మాచాన్‌పల్లిలో ఏర్పాటు చేసిన టీఆర్‌ఎస్‌ ధూంధాం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి హరీశ్‌ రావు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం.. పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలను పెంచి రైతులు, సామాన్యులను పీడిస్తోందని విమర్శించారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నిక అయిపోగానే సిలిండర్‌ ధర మరో రూ.200 పెంచుతుందన్నారు.

బీజేపీకి ఓటేస్తే సిలిండర్‌ ధర రూ.1500 అవుతుందని పేర్కొన్నారు. బీజేపీని బొంద పెడితేనే సిలిండర్‌, పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గుతాయని తెలిపారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా ధర్నా చేస్తున్న రైతులపై కార్లు ఎక్కించి చంపిన చరిత్ర బీజేపీదన్నారు. వ్యవసాయ మోటార్లకు బీజేపీ ప్రభుత్వం మీటర్లు పెడతామంటే వద్దని చెప్పి.. తమ రైతులకు 24 గంటల ఉచిత కరెంటు ఇస్తామని సీఎం కేసీఆర్‌ తేల్చి చెప్పారని హరీష్ అన్నారు.

T20 World Cup 2021: పాకిస్తాన్ టాస్ గెలిస్తే.. ఆ లెక్క సరైనట్లే

రైతు చట్టాలను వ్యతిరేకించిన ఈటల ఇప్పుడు మాట మార్చారని విమర్శించారు. ఈటల రాజేందర్‌ ఏడేళ్లు మంత్రిగా చేసి ఒక్క డబుల్‌ బెడ్‌ రూం ఇల్లు కూడా నిర్మించలేదని విమర్శించారు. బీజేపీ గెలిస్తే ఈటల ఒక్కరికే లాభమన్నారు. టీఆర్ఎస్ గెలిస్తే ప్రజలందరికీ లాభమని తెలిపారు. మహిళా సంఘాలకు లోన్లు ఇప్పిస్తే తనపై విమర్శలు చేస్తున్నారని పేర్కొన్నారు.

సీఎం కేసీఆర్‌ లేకపోతే అసలు ఈటల రాజేందర్‌ అనేటోడు ఉన్నడా అని ప్రశ్నించారు. ఓట్ల కోసం ఈటల పచ్చి మోసపు మాటలు, అబద్దాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ధరల పెరుగుదలతో ప్రజలు బాధలు పడుతున్నా ఫరవాలేదు కానీ తనకు మాత్రం ఓటేయాలని ఈటల రాజేందర్‌ చెప్తున్నారని విమర్శించారు. నిజామాబాద్‌లో ఒక్క రూపాయి పని చేయని ఎంపీ అరవింద్‌.. హుజూరాబాద్‌లో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు.

TRS Plenary : టీఆర్‌ఎస్‌ ప్లీనరీ వేడుకలకు ముస్తాబవుతోన్న భాగ్యనగరం..ఫ్లెక్సీలు, భారీ బ్యానర్ల ఏర్పాటు

రైతుబంధు, రైతుబీమాతో రైతులను ఆదుకుంటున్న ఘనత సీఎం కేసీఆర్‌దేనని కొనియాడారు. కరోనా కష్టకాలంలోనూ రైతుబంధు ఆపొద్దని సీఎం కేసీఆర్‌ తమ జీతాలు కోత పెట్టారని చెప్పారు. రైతుల రుణాలను వడ్డీతో సహా మాఫీ చేస్తామని మంత్రి హరీష్ రావు అన్నారు. 5 వేల డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు పూర్తి చేస్తామని చెప్పారు. కటి, రెండు నెలల్లో 5 లేళ్ల వారికి పింఛన్ ఇస్తామని తెలిపారు.