T20 World Cup 2021: పాకిస్తాన్ టాస్ గెలిస్తే.. ఆ లెక్క సరైనట్లే

విరాట్ కోహ్లీ నేతృత్వంలో టీమిండియా దాయాది జట్టు పాకిస్తాన్ తో తలపడేందుకు రెడీ అయింది. దుబాయ్ లోని వేదికగా ఇరు జట్లు ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ 2021లో తమ తొలి మ్యాచ్ ను ఆడనున్నాయి

T20 World Cup 2021: పాకిస్తాన్ టాస్ గెలిస్తే.. ఆ లెక్క సరైనట్లే

T20 World Cup 2021 (1)

T20 World Cup 2021: విరాట్ కోహ్లీ నేతృత్వంలో టీమిండియా దాయాది జట్టు పాకిస్తాన్ తో తలపడేందుకు రెడీ అయింది. దుబాయ్ లోని ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా ఇరు జట్లు ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ 2021లో తమ తొలి మ్యాచ్ ను ఆడేందుకు రెడీ అయ్యారు. ఆదివారం జరగనున్న ఈ కీలకపోరుకు ఇండియా ఆతిథ్యం ఇవ్వాల్సి ఉండగా రద్దు అయింది.

ఈ రెండు టీంలు చివరిగా 2019 ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ గ్రూప్ స్టేజ్ మ్యాచ్ లో తలపడ్డాయి. ఆ మ్యాచ్ టీమిండియా.. పాక్ ను దారుణంగా దెబ్బతీసింది. ఇదిలా ఉంటే టీ20 ఫార్మాట్లలో టాస్ అనేది చాలా కీలకం. అలాంటిది పాకిస్తాన్ తో జరిగే తొలి టీ20లో ఏ జట్టు టాస్ దక్కించుకుంటుందోనని భారీ అంచనాలు నెలకొన్నాయి.

దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా అక్టోబర్ 24 ఆదివారం రాత్రి 7గంటల 30నిమిషాలకు జరగనుంది.

గతంలో టీమిండియా 3, పాకిస్తాన్ 2సార్లు టాస్ గెలిచాయి. మ్యాచ్ ఫలితం అటుంచితే టాస్ గెలిస్తే ఈ జాబితాలో ఇండియాకు సమం అవుతుంది పాకిస్తాన్. టీ20 వరల్డ్ కప్ ఆరంభ టోర్నీ నుంచి భారత్ ఆడిన ప్రతి మ్యాచ్ లోనూ ఓటమిని ఎదుర్కొంటుంది పాకిస్తాన్.

టాస్ ఫలితం, మ్యాచ్ ఫలితాలను పోల్చి చూస్తే…

2007 వరల్డ్ T20 గ్రూప్ స్టేజ్ – పాకిస్తాన్ మొదట ఫీల్డింగ్ చేయాలని నిర్ణయించుకుంది; మ్యాచ్ టైగా ముగిసింది.
2007 వరల్డ్ టీ 20 ఫైనల్ – ఇండియా మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకుంది; భారత్ 5 పరుగుల తేడాతో విజయం సాధించింది.
2012 టీ 20 వరల్డ్ కప్ సూపర్ 8 – పాకిస్థాన్ మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకుంది; భారత్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
2014 టీ 20 వరల్డ్ కప్ గ్రూప్ 2 – భారత్ మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది; 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
2016 టీ 20 వరల్డ్ కప్ గ్రూప్ 2 – భారత్ మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది; 6 వికెట్ల తేడాతో గెలిచింది.

…………………………………………….: క‌న్న‌డ భామ‌ల హవా.. శ్రీలీలపై యంగ్ హీరోల చూపు

టీమిండియా (తుది జట్టు అంచనా): కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ (కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, మొహమ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా

పాకిస్థాన్ (తుది జట్టు): బాబర్ అజామ్ (కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), ఫఖర్ జమాన్, మహ్మద్ హఫీజ్, షోయబ్ మాలిక్, ఆసిఫ్ అలీ, ఇమాద్ వాసిం, షాదాబ్ ఖాన్, హసన్ అలీ, షాహీన్ అఫ్రిది, హరీస్ రవూఫ్