T20 World Cup 2021 India Vs Pakistan : భారత్ బ్యాటింగ్… ఫైనల్ టీమ్స్ ఇవే

ఇండియాతో మ్యాచ్ లో పాకిస్తాన్ టాస్ గెలిచింది. ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో.. భారత్ బ్యాటింగ్ కు దిగనుంది.

T20 World Cup 2021 India Vs Pakistan : భారత్ బ్యాటింగ్… ఫైనల్ టీమ్స్ ఇవే

India Pak

T20 World Cup 2021 India Vs Pakistan : టీ 20 వరల్డ్ కప్ లో ఇండియాతో మ్యాచ్ లో పాకిస్తాన్ టాస్ గెలిచింది. ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో.. భారత్ బ్యాటింగ్ కు దిగనుంది.

Teams:
India (Playing XI):
రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ(c), సూర్య కుమార్ యాదవ్, రిషభ్ పంత్(w), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, భువీ, షమీ, వరుణ్ చక్రవర్తి, జస్ ప్రీత్ బుమ్రా

Pakistan (Playing XI):
బాబర్ అజాం(c), మొహమ్మద్ రిజ్వాన్(w), ఫఖర్ జమాన్, మొహమద్ హఫీజ్, షోయబ్ మాలిక్, ఆసిఫ్ అలీ, ఇమాద్ వాసిమ్, షాదాబ్ ఖాన్, హసన్ అలీ, హారిస్ రౌఫ్, షహీన్ ఆఫ్రిది

టీ20 వరల్డ్ కప్ లో క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న హై ఓల్టేజ్ మ్యాచ్ భారత్ వర్సెస్ పాకిస్తాన్. చిరకాల ప్రత్యర్థులు భారత్-పాకిస్తాన్ మధ్య పోరు అంటే.. అదో థ్రిల్. ఈ రెండు దేశాల మధ్య క్రికెట్ అంటే.. దాన్ని ఓ ఆటలా చూడరు.. ఓ యుద్ధంలా చూస్తారు అభిమానులు. భారత్-పాక్ మ్యాచ్ అంటే ప్రేక్షకులు టీవీలకే అతుక్కుపోతారు.

Amazon లో రూ.70వేల ఖరీదైన ఫోన్ ఆర్డర్‌ చేస్తే అంట్లు తోమే సోప్ పంపారు

టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా భారత్, పాకిస్తాన్ జట్లు ఆదివారం దుబాయ్ వేదికగా తలపడుతున్నాయి. టోర్నీలో రెండు జట్లకీ ఇదే మొదటి మ్యాచ్‌ కాగా.. గెలుపుతో కప్ వేటని ప్రారంభించాలని ఇరు పట్టుదలగా ఉన్నాయి. కాగా, హెడ్ టు హెడ్ రికార్డులు పాకిస్తాన్ ను మరింత ఎక్కువగా కంగారుపెడుతున్నాయి.

2007 నుంచి టీ20 వరల్డ్‌కప్ జరుగుతుండగా.. ఇప్పటి వరకూ భారత్, పాక్ జట్లు ఐదు సార్లు తలపడ్డాయి. ఈ ఐదింట్లోనూ టీమిండియానే విజయం సాధించింది. ఈ టీ20 వరల్డ్‌కప్‌లోనే కాదు.. వన్డే ప్రపంచకప్‌లోనూ ఇప్పటి వరకూ భారత్‌ని కనీసం ఒక్కసారి కూడా పాకిస్తాన్ ఓడించలేకపోయింది. ఓవరాల్‌గా ప్రపంచకప్‌లో పాక్‌పై 12-0తో అజేయ రికార్డ్‌ని టీమిండియా కొనసాగిస్తోంది.

Porn : షాకింగ్.. పోర్న్ వీడియోలకు అలవాటుపడ్డ 11ఏళ్ల బాలురు.. దానికి ఒప్పుకోలేదని బాలిక హత్య

ఓవరాల్‌గా ఇంటర్నేషనల్ టీ20ల్లో ఇప్పటి వరకూ భారత్, పాక్ జట్లు 8 మ్యాచ్‌ల్లో తలపడగా.. ఇందులో టీమిండియా ఏకంగా ఏడు మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఒక మ్యాచ్‌లో మాత్రమే పాక్ గెలిచింది. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. 2007 టీ20 వరల్డ్‌కప్ ఫైనల్లో పాకిస్తాన్‌‌ని ఓడించే భారత్ జట్టు విజేతగా అవతరించింది. దాంతో.. ఎలా చూసుకున్నా.. ఈరోజు మ్యాచ్‌లో టీమిండియానే హాట్ ఫేవరెట్‌.

వరల్డ్ కప్ లో భారత్‌తో తలపడే జట్టుని పాకిస్తాన్ శనివారమే ప్రకటించేసింది. మొత్తం 12 మందితో కూడిన టీమ్‌ని అనౌన్స్ చేసింది.