School Holidays : కరోనా ఎఫెక్ట్.. మరో రెండు వారాలపాటు బడులు బంద్..?
ఈ నేపథ్యంలో ఈ నెలాఖరు వరకు సెలవులు పొడిగించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే కరోనా ఆంక్షలను ఈనెల 20 వరకు పొడిగించింది ప్రభుత్వం.

School
school holidays for another two weeks : తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతుండడంతో పాఠశాలలు నడపడంపై ప్రభుత్వం ఆలోచనలో పడింది. విద్యాసంస్థలకు సెలవులు పొడిగిస్తే మంచిదనే యోచనలో ఉన్నట్టు సమాచారం. రేపటితో పండుగ సెలవులు ముగుస్తాయి. ఎల్లుండి నుంచి స్కూళ్లు తెరుచుకోవాల్సి ఉంది. అయితే మరో 2 వారాలపాటు సెలవులు పొడిగించాలని సర్కార్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే మంత్రి సబితా ఇంద్రారెడ్డికి కూడా విద్యాశాఖ నివేదిక సమర్పించింది.
ఈ నేపథ్యంలో ఈ నెలాఖరు వరకు సెలవులు పొడిగించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే కరోనా ఆంక్షలను ఈనెల 20 వరకు పొడిగించింది ప్రభుత్వం. దీనివల్ల రోజువారీ కేసుల సంఖ్య కాస్త తగ్గే అవకాశం ఉంటుందని భావిస్తోంది. మరోవైపు ఈ నెల చివరి వరకు కేసులు భారీగా పెరగొచ్చని నిపుణులు చెబుతున్న కారణంగా నెలాఖరు వరకు విద్యాసంస్థలు మూసివేయాలని నిర్ణయించినట్టు సమాచారం.
Covid Vaccine : పక్షవాతంతో బాధపడుతున్న వ్యక్తి కొవిడ్ టీకాతో కోలుకున్నాడు
మరోవైపు ప్రైవేట్ విద్యాసంస్థలు ప్రభుత్వ నిబంధనలు బేఖాతరు చేస్తున్నాయి. కరోనా కారణంగా ఇప్పటికే స్కూళ్లన్నింటికి సర్కార్ సెలవులు ప్రకటించగా ప్రైవేట్, కార్పొరేట్ స్కూల్స్ వాటిని లెక్కలోకి కూడా తీసుకోలేదు.. ఇష్టారాజ్యంగా స్కూల్స్, కాలేజీలు నడిపేస్తున్నాయి. సంక్రాంతి సెలవులు ఉన్నప్పటికీ…ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు క్లాసులు నడుపుతున్నాయి. జిల్లా విద్యాశాఖ అధికారులకు తెలిసినా పెద్దగా పట్టించుకోలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి..