Hyderabad : : హైదరాబాద్‌కి తరలివస్తున్న ఆఫ్రికన్లు.. ఎందుకు? ఏ ఏరియాకి..

టోలీచౌకీలోని పారామౌంట్ కాలనీకి వెళ్తే ఎక్కడ చూసినా ఆఫ్రికన్లు కనిపిస్తారు. దాదాపుగా 5 నుంచి 6 వేల మంది ఆఫ్రికన్లు ఇక్కడ ఉంటారని తెలుస్తోంది. వీరంతా వారి దేశాలు వదిలిపెట్టి ఇక్కడికి ఎందుకు వస్తున్నట్లు?

Hyderabad : : హైదరాబాద్‌కి తరలివస్తున్న ఆఫ్రికన్లు.. ఎందుకు? ఏ ఏరియాకి..

Hyderabad

Hyderabad : హైదరాబాద్ టోలీచౌకీలోని పారామౌంట్ కాలనీలోకి వెళ్తే ఆఫ్రికాలో ఉన్నామా? అని డౌట్ వస్తుంది. ఎక్కడ చూసినా ఆఫ్రికన్లు కనిపిస్తుంటారు. మినీ ఆఫ్రికాను తలపించే ఆ కాలనీకి ఎక్కువగా ఆఫ్రికన్లు రావడానికి కారణం ఏంటో తెలుసా?

TSRTC : గ్రీన్ మెట్రో లగ్జరీ ఏసీ బస్సులు.. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 225 కిలో మీటర్లు ప్రయాణం, నేటి నుంచి హైదరాబాద్ లో పరుగులు

పారామౌంట్ కాలనీకి వెళ్తే ఆఫ్రికాలో ఉన్నట్లు అనిపిస్తుంది. అడుగడగునా ఆఫ్రికన్లు కనిపిస్తుంటారు. దాదాపుగా ఇక్కడ 5 నుంచి 6 వేలమంది ఆఫ్రికన్లు ఉంటారని తెలుస్తోంది. వీరంతా ఎందుకు అక్కడికి వస్తున్నారని చాలామందికి డౌట్ రావచ్చు. వీరిలో చాలామంది వైద్యం కోసం తరలివచ్చినవారేనట. గతంలో వైద్యం కోసం మలేషియాకు వెళ్లేవారట. అయితే అక్కడ వైద్య ఖర్చులు ఎక్కువ కావడంతో అక్కడికంటే ఇక్కడ మేలైన, అనుకూలమైన బడ్జెట్‌లో వైద్య సాయం అందుతుండటంతో వారంతా ఇటువైపు వస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ ప్రాంతానికి ఎక్కువగా సోమాలియా, కెన్యా, సుడాన్, జింబాబ్వే, ఇథియోపియా, నైజీరియా నుంచి జనం తరలివస్తున్నారు. వీరందరికీ వసతితో పాటు భోజన సదుపాయాలు ఇక్కడ అందుబాటులో ఉంటున్నాయి. కొన్ని హోటళ్లలో అరేబియన్, సోమయాలియన్ ఫుడ్స్ దొరుకుతున్నాయి. ఈ ఏరియాలో ఉండే ఆఫ్రికన్లంతా ఒకరితో ఒకరు కలివిడిగా ఉంటూ కష్టసుఖాలు కూడా పంచుకుంటారట.

Hyderabad Realty: హైదరాబాద్‌లో జెట్‌ స్పీడ్‌తో దూసుకుపోతోన్న నిర్మాణ రంగం.. స్థిరమైన వృద్ధితో ఫుల్‌ జోష్‌

వైద్య సేవల కోసం వచ్చే సోమాలియా దేశస్తులకు హైదరాబాద్ మెడికల్ హబ్‌గా మారింది. మరోవైపు ఉన్నత విద్య కోసం తరలివస్తున్న యువతీ, యువకులు కూడా ఇక్కడ పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. మొత్తానికి పారామౌంట్ కాలనీ మినీ ఆఫ్రికాను తలపిస్తోంది.