మందుల కొరత లేదు, సమస్యలను అధిగమించి వెల్ సెంటర్లు పని చేస్తున్నాయి – ఈటెల

  • Published By: madhu ,Published On : November 7, 2020 / 04:58 PM IST
మందుల కొరత లేదు, సమస్యలను అధిగమించి వెల్ సెంటర్లు పని చేస్తున్నాయి – ఈటెల

Updated On : November 7, 2020 / 5:10 PM IST

There is no shortage of medicines Minister Etela : ఎక్కడా మందుల కొరత లేదన్నారు రాష్ట మంత్రి ఈటెల రాజేందర్. ఇబ్బందులను అధిగమించి వెల్ నెస్ సెంటర్లు పని చేస్తున్నాయని, ప్రజలపై రూపాయి భారం పడకుండా సెంటర్లు నిర్వాహణ చేస్తున్నామన్నారు. వచ్చే ఏడాదికి పేదలకు మెరుగైన వైద్యం అందిస్తామన్నారు.



రాష్ట్రంలో పీహెచ్‌సీలకు తోడుగా..5 వేల సబ్ సెంటర్లు పని చేస్తున్నాయన్నారు. ఆరు నెలల్లోనే కాలం చెల్లిన మందులను గుర్తించి తిరిగి పంపిస్తున్నామని, కాలం చెల్లిన మందులను తిరిగి పంపడం ద్వారా..రూ. 15 కోట్లు రాబట్టామన్నారు. ఎక్కడా తప్పులు దొర్లకుండా చూస్తామని మంత్రి ఈటెల తెలిపారు.



వెల్‌నెస్ సెంటర్ నుంచి కాలం చెల్లిన మందులను తరలిస్తున్న వ్యవహారం 10tv కెమెరాకు చిక్కింది. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అధికారుల అనుమతి లేకుండానే రాత్రి పూట మందులను ఎందుకు తీసుకెళ్తున్నారనే విషయంపై 10tv కూపీ లాగింది. ఆ మందులన్నీ ఇతల జిల్లాల్లోని వెల్‌నెస్ సెంటర్లకు చేరాల్సిన మందులుగా తేలింది.



అయితే.. ఇతర జిల్లాలకు పంపించాల్సిన మందులను కూడా.. ఖైరతాబాద్ వెల్‌నెస్ సెంటర్‌లో ఎందుకు ఉంచాల్సి వచ్చింది. ఇవే ప్రశ్నలను 10tv లేవనెత్తుతోంది. అంటే ఇతర జిల్లాల్లోని వెల్‌నెస్ సెంటర్లకు వెళ్లే వారికి మందులు ఇవ్వడం లేదా.. ఒక వేళ మందులను బయట తెచ్చుకోవాలని రాసి చేతులు దులుపుకుంటున్నారా..అనేది తేలాల్సి ఉంది. వెల్‌నెస్ సెంటర్లు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ సంస్థ భారీగా అక్రమాలకు పాల్పడుతోంది. అటు ఉద్యోగుల నియామకాల్లో కూడా అవినీతి జరుగుతోందని 10tv పరిశోధనలో తేలింది.