తెలంగాణలో కరోనా లేదు…నివారణకు అవసరమైతే రూ.1000 కోట్లు ఖర్చు : సీఎం కేసీఆర్
తెలంగాణలో కరోనా లేదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. కరోనా వస్తే నివారణకు అవసరమైతే రూ.1000 కోట్లైనా ఖర్చు చేస్తామన్నారు.

తెలంగాణలో కరోనా లేదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. కరోనా వస్తే నివారణకు అవసరమైతే రూ.1000 కోట్లైనా ఖర్చు చేస్తామన్నారు.
తెలంగాణలో కరోనా లేదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. కరోనా వస్తే నివారణకు అవసరమైతే రూ.1000 కోట్లైనా ఖర్చు చేస్తామన్నారు. మాస్కులు అవసరం లేదన్నారు. శనివారం (మార్చి 7, 2020) అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ కరోనా మన రాష్ట్రంలో పుట్టిన జబ్బు కాదని చైనాలో పుట్టిందన్నారు. విమానాలు, ఓడలు ఎక్కువయ్యాయి కాబట్టి ఇతర దేశాల నుంచి ప్రయాణాలు చేస్తున్నారని తెలిపారు.
అసవరమైతే వెయ్యి కోట్లు ఖర్చు పెట్టైనా కరోనా వైరస్ ను రానివ్వమని చెప్పారు. ఒక వేళ వస్తే సర్వశక్తులు ఒడ్డి ఎదుర్కొంటామని చెప్పారు. అవరసమైతే అసెంబ్లీ సభను బంద్ పెట్టైనా ఎమ్మెల్యేలందరూ ఎవరి నియోజకవర్గంలో వారు నిలబడి మాస్కులు కట్టుకోకుండానే పనిచేస్తామని చెప్పారు. ప్రజలకు లేని మాస్కులు తమకు ఎందుకు అన్నారు.
కాంగ్రెస్, టీడీపీ పాలనలో నీటి కోసం ఎటు చూసినా బిందెల ప్రదర్శన ఉండేదన్నారు. ఇవాళ బిందెల ప్రదర్శన మాయం అయిందన్నారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ఉంటున్న కోటీశ్వరులు ఏ స్వచ్ఛమైన నీళ్లు తాగుతున్నారో ఆదిలాబాద్ లోని గోండు గూడెంలో అవే నీళ్లు తాగుతున్నారని తెలిపారు. నల్గొండ జిల్లా లంబాడీ తండాల్లో అవే నీళ్లు తాగుతున్నారు..ఖమ్మం జిల్లా కోయగూడెంలో కూడా స్వచ్ఛమైన నీళ్లు తాగుతున్నారు. అమ్రాబాద్, అచ్చంపేట మండలాల్లో కూడా అవే నీళ్లు తాగుతున్నారని చెప్పారు.
స్వచ్ఛమైన నీరు అందని ప్రాంతాలు 30 నుంచి 40 మాత్రమే మిగిలాయ్నారు. అవి కూడా కొండలు, గుట్టలపై ఉన్న గ్రామాలన్నారు. ఇండిపెండెంట్ స్కీమ్ పెట్టి వాటిని కూడా కంప్లీట్ చేస్తున్నామని తెలిపారు.
See More :
* కాంగ్రెస్ నేతలు మాకాళ్లు మొక్కినా మేం వారిని కిడ్నాప్ చేయం : సీఎం కేసీఆర్
* CAAపై కేంద్రం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోంది… నాకే బర్త్ సర్టిఫికేట్ లేదు : సీఎం కేసీఆర్