Nizamabad : పెట్రోల్ బంక్‍‌లో దొంగల బీభత్సం

నిజామాబాద్ జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు. జిల్లాలోని దర్పల్లి మండల కేంద్రంలో బుధవారం రాత్రి 8 గంటల సమయంలో ఇండియన్ ఆయిల్ బంక్‌లోకి దొంగలు చొరబడ్డారు.

Nizamabad

Nizamabad : నిజామాబాద్ జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు. జిల్లాలోని దర్పల్లి మండల కేంద్రంలో బుధవారం రాత్రి 8 గంటల సమయంలో ఇండియన్ ఆయిల్ బంక్‌లోకి దొంగలు చొరబడ్డారు. గుంపుగా బంక్ వెనుక గోడ దూకి లోపలికి వచ్చారు. కొందరు బంక్ ముందు కాపలా ఉండగా ఇద్దరు బంక్ లోకి వెళ్లి సిబ్బందిపై దాడి చేశారు. కర్రలు రాళ్లతో బంక్ పై కూడా దాడి చేశారు. అనంతరం లోపలికి చొరబడి క్యాష్ కౌంటర్ ఎత్తుకెళ్లారు. దొంగలకు భయపడిన సిబ్బంది అక్కడి నుంచి కమాన్ వరకు పరుగు తీశారు.

చదవండి : Train Engine‌ Theft : ఏకంగా రైలు ఇంజిన్‌నే దొంగిలించి అమ్మేసిన రైల్వే ఇంజినీర్‌

ఇక సిబ్బంది విషయాన్నీ పోలీసులకు, బంక్ యజమానికి తెలియచేశారు. దర్పల్లి సీఐ శ్రీశైలం సిబ్బందితో కలిసి ఘటనాస్థలికి చేరుకొని పరిశీలించారు. ఓనర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు బంక్ పరిసర ప్రాంతాల్లో తనిఖీ చేయగా.. కొద్దీ దూరంలో క్యాష్ కౌంటర్ కనిపించింది. దానిని స్వాధీనం చేసుకొని పరిశీలించగా లోపల రూ.21 వేల క్యాష్ ఉందని అధికారులు తెలిపారు. అయితే కౌంటర్‌లో రూ.40 వేలు ఉన్నట్లు సిబ్బంది తెలిపారు

చదవండి : 58 Foot Bridge Theft : వామ్మో..58 అడుగుల బ్రిడ్జినే ఎత్తుకుపోయిన దొంగలు..షాక్ అయిన పోలీసులు

దొంగలు మొత్తం మంకీ క్యాప్ ధరించినవచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఈ ముఠాలో 10 మంది ఉన్నట్లు గుర్తించారు. దొంగల కోసం గాలింపు చేపట్టినట్లు పోలీసులు వివరించారు. అయితే తెలంగాణ – మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లోని పలు ఇళ్లు, దుకాణాల్లో దొంగతనాలు చేసిన ఘటనలు ఉన్నాయి.