Telangana: లోహియా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్‭కు 82,000 ఎకరాల భూమిని మంజూరు చేసిన తెలంగాణ ప్రభుత్వం

సాధారణ నూనె వెలికితీత యూనిట్ నుంచి గగన్‌పహాడ్‌లోని ఒక పెద్ద అత్యాధునిక శుద్ధి కర్మాగారానికి, ఆ తర్వాత కాకినాడ, మంఖాల్‌ ప్లాంట్లతో ఎదిగింది. వైవిధ్యభరితమైన ఈ వ్యాపార సంస్థ, ఇప్పుడు అనేక బ్రాండ్‌లను కలిగి ఉంది

Telangana: లోహియా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్‭కు 82,000 ఎకరాల భూమిని మంజూరు చేసిన తెలంగాణ ప్రభుత్వం

Updated On : August 14, 2023 / 9:08 PM IST

Karimnagar: తెలంగాణ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న నూనెల సంస్థ లోహియా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్‌కు కరీంనగర్, జగిత్యాల జిల్లాల్లో 82,000 ఎకరాల భూమిని తెలంగాణ ప్రభుత్వ వ్యవసాయ-సహకార శాఖ మంజూరు చేసింది. ఈ సందర్భంగా లోహియా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్ మహావీర్ లోహియా మాట్లాడుతూ ముడి పామాయిల్ దిగుమతిపై భారతదేశం ఆధారపడటాన్ని తగ్గించి, దేశవ్యాప్తంగా ఉన్న పరిశ్రమల అవసరాలను తీర్చడం పట్ల తెలంగాణ ప్రభుత్వంపై హర్షం వ్యక్తం చేశారు.

Farm loan waiver: రైతుల‌కు కేసీఆర్ స‌ర్కార్ శుభవార్త.. రూ.ల‌క్షలోపు రుణాలు మాఫీ

లోహియా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఒక సాధారణ నూనె వెలికితీత యూనిట్ నుంచి గగన్‌పహాడ్‌లోని ఒక పెద్ద అత్యాధునిక శుద్ధి కర్మాగారానికి, ఆ తర్వాత కాకినాడ, మంఖాల్‌ ప్లాంట్లతో ఎదిగింది. వైవిధ్యభరితమైన ఈ వ్యాపార సంస్థ, ఇప్పుడు అనేక బ్రాండ్‌లను కలిగి ఉంది. దేశవ్యాప్తంగా తమ కార్య కలాపాలను పెంచుతోంది. నాణ్యత హామీతో కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంస్థను, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, VIMTA వంటి మూడవ పార్టీ ల్యాబ్‌లు నాణ్యతా ప్రమాణాల పరంగా పరీక్షలు చేస్తూ నాణ్యతకు నిరంతరం భరోసా ఇస్తున్నాయి.