బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్‌కు బెదిరింపు కాల్.. ఎక్కడి నుంచి ఫోన్ చేశారంటే?
ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ కు బెదిరింపు కాల్ రావడం ఈ వారంలో ఇది రెండోది. మొదట ఆకతాయిల పని అని ప్రభాకర్ లైట్ గా తీసుకున్నారు.

BJP leader NVSS Prabhakar
NVSS Prabhakar: బీజేపీ నేత ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ కు బెదిరింపు కాల్ వచ్చింది. హిందుత్వ రాజకీయాలు మానకపోతే త్వరలోనే మట్టుపెడతామంటూ బెదిరింపులకు పాల్పడ్దారు. +92 34548 65012 నెంబర్ నుండి ఫోన్ కాల్ వచ్చింది. కంట్రీ కోడ్ పాకిస్థాన్ గా ఉన్న బెంగాల్ నుంచి ఫోన్ చేస్తున్నాం అని దుండగుడు పేర్కొన్నాడు. హిందీలో మాట్లాడుతూ.. రోజులు దగ్గరపడ్డాయి త్వరలోనే ఖతం చేస్తాం జాగ్రత్త అంటూ బెదిరింపులకు పాల్పడ్డారు.
ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ కు బెదిరింపు కాల్ రావడం ఈ వారంలో ఇది రెండోది. మొదట ఆకతాయిల పని అని ప్రభాకర్ లైట్ గా తీసుకున్నారు. రెండోసారి కూడా కాల్ రావడంతో ఫోన్ ద్వారా ఉప్పల్ పోలీసులకు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్సమాచారం ఇచ్చారు.