తెలంగాణలో కరోనా : మూడు కిలోమీటర్లు దాటారో..అంతే..బుక్ అవుతారు

దిక్కుమాలిన కరోనా వైరస్ మూలంగా ఎన్నో దేశాలు షట్ డౌన్ అయ్యాయి. దీని ఫలితంగా ప్రజాజీవనం స్థంభించిపోయింది. భారతదేశంలో కూడా లాక్ డౌన్ కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ వైరస్ పంజా విసురుతోంది. ఎక్కడి వారెక్కడో ఉండాలని, ఇంట్లోనే ఉండి..వైరస్ వ్యాప్తి చెందకుండా సహకరించాలని స్వయంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పినా…కొంతమంది పాటించడం లేదు.
పని లేకున్నా బండి తీసుకుని రయ్యి మంటూ రోడ్డెక్కుతున్నారు. ఏదో ఒక పని ఉందంటూ రోడ్లపైకి వస్తూ..లాక్ డైన్ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. ఉక్కుపాదంతో అణిచివేయాలని తెలంగాణ పోలీసులు డిసైడ్ అయ్యారు. కొత్త యాప్ సిద్ధం చేసింది. 3 కిలోమీటర్లు కంటే ఎక్కవ ప్రయాణిస్తే…కేసులు బుక్ చేయనున్నారు. తాము ఎన్ని కిలో మీటర్లు ప్రయాణించామో ? వారికి ఎలా తెలుస్తుంది అనేగా మీ డౌట్. ప్రత్యేకంగా రూపొందించిన యాప్ దానిని పసిగడుతుంది.
లాక్ డౌన్ నేపథ్యంలో పగటి వేళ కొంత వెసులుబాటు కల్పించారు. ఆ సమయంలో ఎవరైనా వారి ఇంటి నుంచి కేవలం 3 కి.మీటర్లు మాత్రమే ప్రయాణించాల్సి ఉంటుంది. కాన దీనిని చాలా మంది ఉల్లంఘిస్తున్నారు. దీనిపై తెలంగాణ పోలీసు శాఖ దృష్టి పెట్టింది. ఆటోమేటిక్ పర్సన్ ఐడెంటిఫికేషన్ పేరిట యాప్ సిద్ధం చేసింది. క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న అందరి ఫోన్లు, ట్యాబ్ లలో సేవ్ చేశారు.
ఎవరైనా రోడ్డు ఎక్కిన సమయంలో అక్కడే ఉన్న పోలీసులు ఆ వ్యక్తి వివరాలు, ఫోన్ నెంబర్, తదితర సమాచారాన్ని నమోదు చేస్తారు. కొంతదూరం వెళ్లాక తనిఖీలు చేస్తున్న పోలీసులు పేరు, వాహనం నెంబర్ వంటివి నమోదు చేస్తారు. GPS ద్వారా పనిచేసే ఈ యాప్ ఆ వ్యక్తి ఎంతదూరం ప్రయాణించాడో లెక్కకడుతుంది. దీనిని బట్టి 3 కి.మీటర్లు నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే కేసు బుక్ చేస్తారు. అనంతరం వాహనాన్ని స్వాధీనం చేసుకుంటారు. 2020, ఏప్రిల్ 09వ తేదీ బుధవారం నుంచే అమల్లోకి తెచ్చారు. సో..వాహనం తీసే ముందు ఒకసారి ఆలోచించుకొండి..(లాక్‌డౌన్ టైమ్‌లో టిక్‌టాక్ టిక్‌టాక్… ఇండియన్స్ ఎక్కువగా అందులోనే!)