రామగుండం బీఆర్ఎస్‌లో ఇప్పటినుంచే టికెట్ ఫైట్.. రేసులో ముగ్గురు లీడర్లు.. క్యాడర్‌లో గందరగోళం

ముగ్గురు నేతలు..మూడు వర్గాలు. అందరూ అధిష్టానం పెద్దలకు సన్నిహితులే. ఓ నేత మాజీ ఎమ్మెల్యే. మరో నేత కేటీఆర్‌కు సన్నిహితుడు.

రామగుండం బీఆర్ఎస్‌లో ఇప్పటినుంచే టికెట్ ఫైట్.. రేసులో ముగ్గురు లీడర్లు.. క్యాడర్‌లో గందరగోళం

Updated On : August 1, 2025 / 8:48 PM IST

రామగుండం బీఆర్ఎస్‌లో గ్రూపు పాలిటిక్స్‌ ఇంట్రెస్టింగ్‌గా మారాయి. మాజీ ఎమ్మెల్యే మళ్లీ తానే అభ్యర్థినని ఫుల్‌ హోప్స్‌తో ఉంటే..ఇద్దరు నేతలు టికెట్ రేసులోకి రావడంలో నియోజకవర్గ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల వరకు కోరుకంటి చందర్ కనుసన్నల్లోనే రామగుండం బీఆర్ఎస్ వ్యవహారాలు నడిచాయి. ఇప్పుడు సీనియర్ నేత కౌశిక్ హరి తనకంటూ క్యాడర్‌ను తయారు చేసుకుంటూ..వచ్చే ఎన్నికల్లో పోటీ చేసి తీరుతానంటున్నారు.

చందర్‌ను కాదని, కౌశిక్ హరికి టికెట్ ఇవ్వకపోవచ్చన్న చర్చ జరుగుతున్న నేపథ్యంలోనే బీఆర్ఎస్ ఎన్‌ఆర్ఐ నాయకుడు హరీష్ రెడ్డి ఎంట్రీ ఇచ్చారు. దీంతో డోంట్ వర్రీ అనుకున్న వారిలో ఇప్పుడు అసలు వర్రీ మొదలైందట. హరీష్ రెడ్డి కేటీఆర్‌కు సన్నిహితుడు కావడమే ఆశావహులకు ఆందోళన కలిగిస్తోందట. హరీష్‌రెడ్డి అధికార పార్టీపై సోషల్ మీడియాలో తన గళాన్ని వినిపించడంతో పాటుగా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో VHR స్వచ్చంద సంస్థ పేరుతో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు.

Also Read: జగన్‌ ఇలాకలో రెండు జడ్పీటీసీ సీట్లకు ఉప ఎన్నికలు.. జగన్‌కు ఝలక్‌ ఇచ్చేందుకు టీడీపీ స్కెచ్

కేటీఆర్‌ సపోర్ట్‌తో పాటుగా…ప్రత్యర్ధిన విమర్శించే వాగ్ధాటి, ఆర్ధికంగా బలంగా ఉండటంతో పాటుగా క్యాడర్‌ను మెయింటెన్ చేస్తున్నారు. దీంతో బీఆర్ఎస్ తరుఫున హరీష్ రెడ్డి పోటిలోకి దిగుతారనే చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతుంది. హరీష్‌రెడ్డి కేటీఆర్‌తో పాటు బీఆర్ఎస్ ముఖ్యనేతలను కలుస్తుండటంతో..ఇదంతా ముందస్తు ప్లాన్‌గానే భావిస్తున్నారు. ఈ పరిణామాలను అంచనా వేసిన మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పట్టు సడలకుండా పక్కాగా ప్లాన్ చేసుకుంటున్నారట. పార్టీ క్యాడర్‌లో జోష్ నింపుతూనే, వారిని కలుపుకుంటూ తన వెంట నడుచుకునేలా చేస్తున్నారట.

వీరి మధ్య ఓ రేంజ్‌లో పైట్
ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో చందర్ వర్గీయులకు, హరీష్ రెడ్డి ఫాలోవర్స్ మధ్య ఓ రేంజ్‌లో పైట్ జరుగుతుంది. అధికార, ప్రతిపక్ష నేతల మధ్య జరగాల్సిన సోషల్ మీడియా వార్..విత్ ఇన్ బీఆర్ఎస్‌ పార్టీలోనే హీటెక్కిస్తోంది. ఒకరిపై ఒకరు విమర్శల దాడి చేసుకుంటూ రచ్చకెక్కుతున్నారు. ఓ వైపు కౌశిర్ హరి, మరోవైపు హరీష్ రెడ్డి ఇద్దరికి చెక్ పెట్టేలా చందర్ జనాల్లో తిరుగుతూ, క్యాడర్‌తో మరింతగా సఖ్యతతో ఉండే ప్రయత్నం చేస్తున్నారు. చందర్‌ బీసీ సామాజిక వర్గం కావడం, కేసీఆర్, కేటీఆర్ ఆశీస్సులు ఉండటంతో తన టికెట్‌కు ఢోకా ఉండదననే ధీమాలో ఉన్నారు.

ముగ్గురు నేతలు..మూడు వర్గాలు. అందరూ అధిష్టానం పెద్దలకు సన్నిహితులే. ఓ నేత మాజీ ఎమ్మెల్యే. మరో నేత కేటీఆర్‌కు సన్నిహితుడు. పైగా యూఎస్‌ రిటర్న్‌. ఇంకో నేత తెల్లారు లేస్తే పార్టీ తరఫున మీడియా డిస్కషన్స్‌లో గళం వినిపిస్తారు. దీంతో ఆ ముగ్గురి లీడర్లలో ఎవరి వెంట నడవాలో క్యాడర్‌కు అర్థం కావడం లేదట. అధిష్టానం ఓ క్లారిటీ ఇస్తే కన్‌ఫ్యూజన్‌ ఉండదని క్యాడర్ మధన పడుతున్నారట. రామగుండం బీఆర్ఎస్‌లో ముగ్గురు లీడర్ల కోల్డ్‌వార్‌కు అధిష్టానం సెక్‌ పెడితే తప్ప..ఈ రచ్చ ఆగేలా లేదంటున్నారు. వచ్చే ఎన్నికల్లో రామగుండం బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగెదెవరో.? రాజీ పడేదెవరో.? చూడాలి మరి..