Mahesh Goud: సెంటిమెంట్ రగిల్చి లబ్ది పొందే ప్రయత్నం..! ఎస్పీ బాలు విగ్రహ ఏర్పాటు వివాదంపై టీపీసీసీ చీఫ్ హాట్ కామెంట్స్..

తెలంగాణలో ఏపీ వ్యక్తుల విగ్రహాలు ఎందుకు అంటూ అడ్డుకున్నారు.

Mahesh Goud: సెంటిమెంట్ రగిల్చి లబ్ది పొందే ప్రయత్నం..! ఎస్పీ బాలు విగ్రహ ఏర్పాటు వివాదంపై టీపీసీసీ చీఫ్ హాట్ కామెంట్స్..

Updated On : December 4, 2025 / 6:24 PM IST

Mahesh Goud: హైదరాబాద్ రవీంద్రభారతిలో ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం విగ్రహ ఏర్పాటుపై వివాదం కంటిన్యూ అవుతోంది. ఎస్పీ బాలు విగ్రహం ఏర్పాటుపై టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ స్పందించారు. ఓ కళాకారుడిగా ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం అందరి వాడన్న మహేశ్ గౌడ్.. రవీంద్ర భారతిలో బాలు విగ్రహం పెడితే తప్పేంటి అని స్పందించారు. సెంటిమెంట్ ను రగిల్చి లబ్ది పొందేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు.

ఈ నెల 15న ఎస్పీ బాలు విగ్రహావిష్కరణకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుండగా.. తెలంగాణ ఉద్యమకారుడు పృథ్వీరాజ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలంగాణలో ఏపీ వ్యక్తుల విగ్రహాలు ఎందుకు అంటూ అడ్డుకున్నారు. ఇదే సమయంలో ఓ య్యూటూబ్ ఛానల్ కు పృథ్వీరాజ్ ఇంటర్వ్యూ ఇస్తుండగా అక్కడికి చేరుకున్నారు శుభలేఖ సుధాకర్. ఎస్పీ బాలు గురించి అలా మాట్లాడొద్దని వారించడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. రవీంద్రభారతిలో గద్దర్, అందెశ్రీ విగ్రహాల ఏర్పాటుకు పృథ్వీరాజ్ డిమాండ్ చేశారు.

Also Read: నిరుద్యోగులు గెట్‌ రెడీ.. త్వరలో 40,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు.. ఫుల్ డీటెయిల్స్‌