కాంగ్రెస్ ఆధ్వర్యంలో అన్ని జిల్లాల్లో కులగణనపై సమావేశాలు జరుగుతాయి: టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్
ఎవరు ఎంత శాతం ఉంటే వారికి అంత శాతం అవకాశాలు ఇవ్వాలనేది రాహుల్ ఆకాంక్ష అని చెప్పారు.

Mahesh Kumar Goud
దేశంలో కులగణన జరగాలని గళం విప్పిన మొనగాడు తమ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. ఇవాళ హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో మహేశ్ కుమార్ గౌడ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ… రాహుల్ గాంధీ ఈ దేశ భవిష్యత్తు అని చెప్పుకొచ్చారు.
ఎవరు ఎంత శాతం ఉంటే వారికి అంత శాతం అవకాశాలు ఇవ్వాలనేది రాహుల్ ఆకాంక్ష అని చెప్పారు. కులగణన కాంగ్రెస్ ఆలోచన అని అన్నారు. జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో అన్ని జిల్లాల్లో కులగణనపై సమావేశాలు జరుగుతాయని ప్రకటించారు.
సమావేశాల్లో కుల సంఘాలు, మేధావులు, విద్యార్థులు, యువకులు పాల్గొంటారని మహేశ్ కుమార్ గౌడక్ తెలిపారు. కుల గణనపై సమావేశం జరుపుతామని, అందుకు రావాలని రాహుల్ గాంధీని ఆహ్వానించినట్లు వివరించారు. నవంబరు 5 లేదా 6వ తేదీన భారీ సభను ఏర్పాటు చేస్తామని అన్నారు.
కులగణన సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం చేస్తామని మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. జనగణనలో కులగణన చేయాలని డిమాండ్ చేస్తూ టీపీసీసీ తీర్మానం చేసి, ఆ కాపీని కేంద్రానికి పంపుతున్నట్లు చెప్పారు. గత ప్రభుత్వ దోపిడీ, అరాచకాలపై తగు చర్యలు తప్పకుండా ఉంటాయని అన్నారు.
ముఖ్యమంత్రి కుర్చీకి ఉన్న గౌరవాన్ని రేవంత్ రెడ్డి తగ్గించారు: హరీశ్ రావు