Revanth Reddy : కేసీఆర్ ది మాఫియా మోడల్.. మోదీది కార్పొరేట్ మోడల్ : రేవంత్ రెడ్డి

పేదల బాగు కోసం కాంగ్రెస్ తెలంగాణ ఇస్తే.. కేసీఆర్ మాఫియా ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ లక్ష కోట్ల రూపాయల సొమ్ము కాజేశారని ఆరోపించారు.

Revanth Reddy (2)

Revanth Reddy : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్ పై విమర్శలు చేశారు. కేసీఆర్ మోడల్ అత్యంత ప్రమాదకరమైనదని.. మాఫియా మోడల్ అని వ్యాఖ్యానించారు. బీజేపీ, నరేంద్రమోదీ కార్పొరేట్ మోడల్ తీసుకొచ్చారని పేర్కొన్నారు. కార్పొరేట్ కంపెనీలు ఇచ్చే పైసలతో ప్రభుత్వాలను పడగొడుతున్నారని చెప్పారు. కాంగ్రెస్ హయాంలో ఫ్రీడం స్పిరిట్ మోడల్ లో పరిపాలన అందించామన్నారు. కేసీఆర్.. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీల వద్దకు వెళ్లి తనను నాయకుడిగా చేస్తే పైసలు ఇస్తా అంటున్నారని పేర్కొన్నారు.

కేజ్రీవాల్ తో మొదలు కొని కర్ణాటక జేడీయూ, ఇతర పక్షాలకు విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్.. పూర్తిగా తెలంగాణ జవసత్వాలను గాలికొదిలేశారని విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో పేదలకు భూములు పంచామని గుర్తు చేశారు. పేదల బాగు కోసం కాంగ్రెస్ తెలంగాణ ఇస్తే.. కేసీఆర్ మాఫియా ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ లక్ష కోట్ల రూపాయల సొమ్ము కాజేశారని ఆరోపించారు. దేశ రాజకీయాలను సాధించాలని చూస్తున్నారని పేర్కొన్నారు. దావూద్ ఇబ్రహీం మాదిరిగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

Revanth Reddy : బీజేపీ, బీఆర్ఎస్ ఒప్పందం‌లో భాగంగానే ఈ డ్రామా-పేపర్ లీక్‌పై రేవంత్ రెడ్డి

హెటేరో పార్థసారథి రెడ్డి.. కరోనా సమయంలో రెమిడిసివర్ ను బ్లాక్ లో అమ్ముకున్నారని ఆరోపించారు. రూ.142 కోట్ల నగదు ఐటీ రైడ్స్ లో బయటపడిందన్నారు. 2014లో సాయిసింధు ఒక స్వచ్ఛంద సంస్థను పార్థసారథి రెడ్డి ఒక ఎన్జీవో ఏర్పాటు చేశారని తెలిపారు.ఎన్జీవో సంస్థ ఆధ్వర్యంలో క్యాన్సర్ హాస్పిటల్ ఏర్పాటు చేస్తానని దరఖాస్తు చేసుకుంటే హైటెక్ సిటీ పరిధిలో 15 ఎకరాల భూమిని కేటాయించారని పేర్కొన్నారు. సాయిసింధుకు కేటాయించిన భూమి విలువ 15 వందల కోట్ల విలువ అయితే 505 కోట్ల రూపాయలు ఉందని అధికారులు నిర్ధారించారని చెప్పారు.

సాయిసింధు సంస్థ ఏర్పాటు చేసే క్యాన్సర్ హాస్పిటల్ కు 10 ఎకరాలు సరిపోతుందని అధికారులు నివేదిక ఇచ్చారని వెల్లడించారు. భూమికి ప్రతి ఏడాది 10 శాతం రెంట్ వసూలు చేయాలని, ఐదేళ్ల తర్వాత మార్కెట్ విలువ ప్రకారం నిర్ధారించి మళ్లీ 10 శాతం వసూలు చేయాలని జీవో నిబంధనలు ఉన్నాయని పేర్కొన్నారు.నిబంధనల ప్రకారం రూ.50 కోట్ల రెంట్ రావాల్సి ఉంటే.. రూ.1.5 లక్షల రెంట్ వసూలు చేయాలని కేసీఆర్ ఆదేశాలు ఇచ్చారని వెల్లడించారు. 60 ఏళ్లలో 5 వేల కోట్లు రూపాయలు రెంట్ రావాల్సి ఉంటే కోటి 46 లక్షల రూపాయలకు కట్ట బెట్టారని ఆరోపించారు.

Revanth Reddy : కేసీఆర్, కేటీఆర్ ప్రమేయం లేకుండా ఏ స్కామ్ కూడా జరగలేదు, ఆంధ్రా వ్యక్తికి ఉద్యోగం ఎలా ఇచ్చారు?-రేవంత్ రెడ్డి

ఇంత దారుణమైన దోపిడీ.. ప్రపంచంలో మరెక్కడైనా ఉంటుందా..? అని అన్నారు. వరుసగా కేసీఆర్ భూదోపిడి బాగోతాలను బయటపెడతానని చెప్పారు. రేపు యశోద, ఎల్లుండి కొర్ర శ్రీనివాస్ బాగోతాలను బయట పెడతానని వెల్లడించారు. తోట చంద్రశేఖర్ కు 50 ఎకరాలు కట్టబెట్టారని తెలిపారు.కేసీఆర్ మోడల్ అత్యంత ప్రమాదకరమని.. భూములను కొల్లగొట్టి మాఫియాను సృష్టిస్తున్నారని విమర్శించారు. మోదీ ఏ విధంగా అయితే అదానీ, అంబానీలకు కట్టబెడుతన్నాడో ఆ విధంగానే కేసీఆర్ కూడా తయారవుతాడని పేర్కొన్నారు. కేసీఆర్ కు ఏమాత్రం సంధు ఇచ్చిన మాఫియా నీడన బతకాల్సి వస్తుందన్నారు.

కేసీఆర్ దోపిడీపై దేశంలోని అన్ని రాజకీయ పార్టీలకు లేఖ రాస్తానని చెప్పారు. రూ.2 లక్షల బడ్జెట్ రాష్ట్రంలోనే కేసీఆర్ లక్ష కోట్ల దోపిడీ చేశాడని ఆరోపించారు. రూ45 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న దేశంలో ఏ చిన్న అవకాశం ఇచ్చినా జరగబోయే పరిణామాలు ఊహించలేమని చెప్పారు. దేశంలో పెను ప్రమాదం జరగనుందన్నారు. దావుద్ ఇబ్రహీం కంటే కేసీఆర్ ప్రమాదకారి అని విమర్శించారు.

Revanth Reddy : ఆత్మగౌరవంతో బతికే రైతులను ఆత్మహత్య చేసుకునే స్థితికి తెచ్చారు : బీఆర్ఎస్ ప్రభుత్వంపై రేవంత్ రెడ్డి ఫైర్

హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు ఊచలు లెక్కించాల్సి ఉంటుందని హెచ్చరించారు. జూబ్లీహిల్స్ లో నమస్తే తెలంగాణకు భూములు ఎలా వచ్చాయో కూడా బయట పెడతానని చెప్పారు. మరో రాజ్యసభ సభ్యుడికి కూడా భూములు ఎలా వచ్చాయో బయట పెడతానని వెల్లడించారు. బీఆర్ఎస్ తో పొత్తులు అంటే.. రేవంత్ రెడ్డి ఉన్నంత కాలం ఆ ఇంటి మీద ఉన్న కాకి ఈ ఇంటి మీద వాలదు.. ఒకవేళ వాలిందా చచ్చినట్లేనని పేర్కొన్నారు.