Revanth Reddy : బీజేపీ, బీఆర్ఎస్ ఒప్పందం‌లో భాగంగానే ఈ డ్రామా-పేపర్ లీక్‌పై రేవంత్ రెడ్డి

Revanth Reddy: పేపర్లు దొంగతనం చేసినోళ్లను పట్టుకోకుండా కొనుగోలు చేసి రాసినోళ్లను పట్టుకుంటున్నారు. కాన్ఫిడెన్షియల్ విషయాలు మంత్రి కేటీఆర్ కు ఎలా తెలుస్తున్నాయి.

Revanth Reddy : బీజేపీ, బీఆర్ఎస్ ఒప్పందం‌లో భాగంగానే ఈ డ్రామా-పేపర్ లీక్‌పై రేవంత్ రెడ్డి

Revanth Reddy (Photo : Twitter)

Revanth Reddy : తొలుత టీఎస్ పీఎస్ సీ క్వశ్చన్ పేపర్ లీక్, ఆ తర్వాత టెన్త్ పేపర్ల లీక్.. తెలంగాణలో సంచలనం రేపాయి. పేపర్ లీక్ అంశం రాజకీయ దుమారం రేపింది. తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ అరెస్ట్ తో వివాదం తారస్థాయికి చేరింది. ఈ వ్యవహారంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. టెన్త్ పేపర్ లీక్ వెనుక బండి సంజయ్ కుట్ర నిజమే అయితే.. బెయిల్‌పై ప్రభుత్వం పై కోర్టులను ఎందుకు ఆశ్రయించలేదని రేవంత్ రెడ్డి నిలదీశారు. బీజేపీ, కేసీఆర్ ఒప్పందంలో భాగంగానే ఈ డ్రామా నడిచిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు.

Also Read..SSC Paper leak Case: టెన్త్ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న విద్యార్థి హరీశ్ కి ఊరట

”పేపర్ లీక్, పేపర్ అవుట్ కు తేడా ఉంది. Tspsc పేపర్ లీక్ అయ్యింది. Ssc పేపర్ అవుట్ అయ్యింది. ఎస్ఎస్ సీ పరీక్షలు రాసే వాళ్ళు పరీక్షా కేంద్రాల్లోనే ఉండగానే పేపర్ ఔట్ అయ్యింది. పేపర్ అవుట్ కు, పేపర్ లీక్ కు చాలా తేడా ఉంది. Tspsc పేపర్.. పరీక్షకు చాలా రోజుల ముందే బయటికొచ్చింది. Tspsc పేపర్ లీక్ లో రాజశేఖర్ రెడ్డి, ప్రవీణ్ లే కాదు. చాలామంది ఉన్నారు.

Also Read..Nalgonda Constituency: పక్కా స్కెచ్‌తో నల్లగొండలో కారు పాగా.. ఈసారి సత్తా చాటేదెవరు?

Tspsc బోర్డునే రద్దు చేసి మళ్లీ పరీక్షలు పెట్టాలి. Tspsc పేపర్లు దొంగతనం చేసినోళ్లను పట్టుకోకుండా కొనుగోలు చేసి రాసినోళ్లను పట్టుకుంటున్నారు. అసలు దొంగలను పట్టుకోవాల్సిన సిట్.. చైర్మన్, సెక్రెటరీ, సభ్యులను సాక్షులుగా పిలిచి అడుగుతున్నారు. ముద్దాయిలు వేరు, సాక్షులు వేరు. ఈ కేసులో కాన్ఫిడెన్షియల్ విషయాలు మంత్రి కేటీఆర్ కు ఎలా తెలుస్తున్నాయి. సిట్ అధికారులు చెబుతున్నారా? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.