Revanth Reddy: ఇంటి దొంగలకు డెడ్‌లైన్.. కష్టపడే కార్యకర్తలను కడుపులో పెట్టుకుంటా -రేవంత్ రెడ్డి
నిత్యావసర ధరలను తగ్గించాలనే డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా ఇంటి దొంగలు ఉంటే నెలాఖరులోగా వెళ్లి పోవచ్చంటూ డెడ్‌లైన్ విధించారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.

Revanth Red
Revanth Reddy: నిత్యావసర ధరలను తగ్గించాలనే డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా ఇంటి దొంగలు ఉంటే నెలాఖరులోగా వెళ్లి పోవచ్చంటూ డెడ్‌లైన్ విధించారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్‌లోని ఇంటి దొంగలను వదిలే ప్రసక్తేలేదని హెచ్చరించారు. కష్టపడే కార్యకర్తలను కడుపులో పెట్టుకుని చూసుకుంటానని హామీ ఇచ్చిన రేవంత్.. తమ పార్టీ కార్యకర్తలను అధికారులు ఇబ్బంది పెడితే మాత్రం సహించేది లేదన్నారు.
ఇప్పటికే ఇబ్బంది పెట్టే వారి డైరీ రాస్తున్నామని, అధికారులు ఒళ్లు దగ్గర పెట్టుకుని, చట్ట పరిధిలో పని చేయాలని సూచించారు. చట్టాన్ని ఉల్లంఘిస్తే మూల్యం చెల్లిస్తారని అధికారులకు వార్నింగ్ ఇచ్చారు. 2023లో గోల్కొండ ఖిల్లాపై కాంగ్రెస్ జెండా ఎగుర వేయబోతున్నట్లు చెప్పుకొచ్చారు రేవంత్ రెడ్డి.
సోనియమ్మ రాజ్యంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు, రైతులకు గిట్టుబాటు ధర లబిస్తుందన్నారు. గ్రామాలలో మా కార్యకర్తలను వేదిస్తే తోడుకలు తీస్తామంటూ హెచ్చరించారు. కాంగ్రెస్‌లో ఎకపక్ష నిర్ణయాలు ఉండవని, హుజూరాబాద్‌లో కమీటి నిర్ణయం ప్రకారమే నిర్ణయాలు తీసుకుంటామన్నారు. హుజూరాబాద్‌లో ఇద్దరు దోంగలు టీఆర్ఎస్, బీజేపీలకు బుద్ధి చెబుతామన్నారు.