Hyderabad: హైదరాబాద్‌లో వాహనదారులకు బిగ్ అలర్ట్.. రేపు నగరంలోని ఈ రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు..
సీతారాంబాగ్ నుంచి సుల్తాన్ బజార్ వరకు శోభాయాత్ర సాగనుంది. ట్రాఫిక్ ఆంక్షల నేపథ్యంలో వాహనదారులకు అలర్ట్ జారీ చేశారు ట్రాఫిక్ పోలీసులు.
Hyderabad: శ్రీరామనవమి శోభాయాత్ర సందర్భంగా హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. శోభాయాత్ర జరిగే ఏరియాలో రేపు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయి. పలు చోట్ల ట్రాఫిక్ డైవర్షన్ చేశారు. మరికొన్ని ప్రాంతాల్లో కొన్ని మార్పులు చేశారు.
సీతారాంబాగ్ నుంచి సుల్తాన్ బజార్ వరకు శోభాయాత్ర సాగనుంది. ట్రాఫిక్ ఆంక్షల నేపథ్యంలో వాహనదారులకు అలర్ట్ జారీ చేశారు ట్రాఫిక్ పోలీసులు. ఆ రూట్ లో కాకుండా మరో రూట్ లో ప్రయాణం చేయాలని సూచించారు. ప్రయాణానికి ఇబ్బందులు కలగకుండా వాహనదారులు ఎక్కడెక్కడ ట్రాఫిక్ ఆంక్షలు ఉన్నాయో ముందే తెలుసుకుని అందుకు అనుగుణంగా ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవడం బెటర్. ట్రాఫిక్ ఆంక్షల నేపథ్యంలో ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలు ఉపయోగించాలని ట్రాఫిక్ పోలీసులు సూచన చేశారు.
* ఆసిఫ్‌నగర్-బోయిగూడ కమాన్ ట్రాఫిక్.. మల్లేపల్లి, నాంపల్లి వైపు మళ్లింపు
* అఘాపురా, హబీబ్‌నగర్ నుంచి సీతారాంబాగ్ మార్గం డైవర్షన్
* దారుసలాం-అఘాపురా ఎక్స్ రోడ్స్ వద్ద ట్రాఫిక్ మళ్లింపు
* మంగళ్‌హాట్, పురానాపూల్, గాంధీ విగ్రహం ప్రాంతాల్లో మార్గ మార్పులు
* MJ బ్రిడ్జ్ నుంచి అఫ్జల్‌గంజ్ ట్రాఫిక్ జుమేరాత్ బజార్ వైపు మళ్లింపు
* బేగంబజార్ ఛత్రీ, SA బజార్, అఫ్జల్‌గంజ్ వద్ద పరిమితులు
* అబిడ్స్ GPO వద్ద ట్రాఫిక్ బ్యాంక్ స్ట్రీట్, ఆంధ్ర బ్యాంక్ రోడ్డు వైపు మళ్లింపు
* పుట్లిబౌలి, రంగమహల్, CBS ప్రాంతాల్లో ప్రత్యేక డైవర్షన్లు
* చాదర్‌ఘాట్-కాచిగూడ మార్గాల్లో ట్రాఫిక్ మార్పులు
* సుల్తాన్ బజార్ వైపు వచ్చే వాహనాలకు బొగ్గులకుంట వద్ద మళ్లింపు
* రద్దీ ప్రాంతాలు: బేగంబజార్, SA బజార్, అఫ్జల్‌గంజ్, CBS, MJ మార్కెట్, అబిడ్స్, చాదర్‌ఘాట్, కాచిగూడ
Also Read: చికెన్ ప్రియులకు బిగ్ అలర్ట్.. ఏప్రిల్ 1నుంచి చికెన్ షాపులు బంద్.. కారణాలు ఇవే..
