ధరణి వెబ్‌సైట్ నిర్వహణపై తహసీల్దార్లకు శిక్షణ

dharani: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ధరణి వెబ్‌సైట్ నిర్వహణపై.. తహసీల్దార్లకు శిక్షణ ఇస్తోంది. మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్ అనురాగ్ యూనివర్సిటీ క్యాంపస్‌లో తహసీల్దార్లకు శిక్షణ ఇవ్వనున్నారు. ప్రభుత్వ ఆదేశాలతో.. ఈ శిక్షణకు తహసీల్దార్లు, నాయబ్ తహసీల్దార్లు, కంప్యూటర్ ఆపరేటర్లు హాజరయ్యారు. ధరణి పోర్టల్ అక్టోబర్ 29న ప్రారంభించనుండగా.. పోర్టల్ నిర్వహణపై రెవెన్యూ సిబ్బందికి థియరీ, ప్రాక్టికల్ క్లాసులు నిర్వహిస్తున్నారు.
అక్టోబర్ 29 నుంచి భూముల క్రయవిక్రయాలు పునర్ ప్రారంభం:
ఇక ధరణి పోర్టల్ ప్రారంభం తర్వాత రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు, ఇతర భూ సంబంధమైన కార్యక్రమాలన్నీ జరుగుతాయి. కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకొస్తున్న నేపథ్యంలో సెప్టెంబర్ 8 నుంచి రాష్ట్రంలో భూముల క్రయవిక్రయాలను రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేసింది. అక్టోబర్ 29 నుంచి అవన్నీ పునర్ ప్రారంభమవుతాయి. ఇప్పటికే తహసీల్దార్లు రిజిస్ట్రేషన్, మ్యుటేషన్లను ట్రయల్ రన్‌గా చేపట్టారు.