Munugode Bypoll: వ్యూహం ప్రకారమే ఈటల, ఆయన భార్యపై దాడికి దిగారు: కిషన్ రెడ్డి
మునుగోడు ఎన్నిక వేళ.. హింసను ప్రేరేపించేలా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడారని కిషన్ రెడ్డి అన్నారు. బీజేపీ నేతల ఫోన్లను రాష్ట్ర ప్రభుత్వం ట్యాప్ చేస్తోందని ఆయన ఆరోపించారు. మునుగోడులో ఓడిపోతామని తెలిసే తమ పార్టీ నేతలు, కార్యకర్తలపై టీఆర్ఎస్ దాడులు చేయడానికి కుట్రలు పన్నిందని చెప్పారు. ఇటువంటి దాడులకు తమ పార్టీ కార్యకర్తలు భయపడబోమని ఆయన అన్నారు.

Munugode Bypoll: వ్యూహం ప్రకారమే బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, ఆయన భార్యపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడికి దిగారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణలోని మునుగోడు అసెంబ్లీ స్థానానికి ఎల్లుండి ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో పులివెలలో టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలు రాళ్లతో పరస్పరం దాడులు చేసుకోవడంపై కలకల రేపిన విషయం తెలిసిందే. దీనిపై కిషన్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. టీఆర్ఎస్ దాడులు చేస్తూ భయభ్రాంతులకు గురి చేయాలని అనుకుంటోందని చెప్పారు.
మునుగోడు ఎన్నిక వేళ.. హింసను ప్రేరేపించేలా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడారని కిషన్ రెడ్డి అన్నారు. బీజేపీ నేతల ఫోన్లను రాష్ట్ర ప్రభుత్వం ట్యాప్ చేస్తోందని ఆయన ఆరోపించారు. మునుగోడులో ఓడిపోతామని తెలిసే తమ పార్టీ నేతలు, కార్యకర్తలపై టీఆర్ఎస్ దాడులు చేయడానికి కుట్రలు పన్నిందని చెప్పారు. ఇటువంటి దాడులకు తమ పార్టీ కార్యకర్తలు భయపడబోమని ఆయన అన్నారు.
మునుగోడులో పోలీసులు అధికార పార్టీ టీఆర్ఎస్ కు అనుకూలంగా వ్యవహరిస్తూ ఆ పార్టీ నేతల కార్లను తనిఖీ చేయడం లేదని కిషన్ రెడ్డి చెప్పారు. గతంలో టీఆర్ఎస్ కు ఈటల రాజేందర్ రాజీనామా చేయడంతో వచ్చిన హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితంతో టీఆర్ఎస్ కు భయం పట్టుకుందని, ఆ పార్టీకి ఏం చేయాలో తెలియట్లేదని విమర్శించారు.
10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..