TRS Protest : మోదీపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు!
పార్లమెంట్ వేదికగా ఏపీ విభజనపై ప్రధాని నరేంద్ర మోదీ సంచలన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. రాజకీయ స్వార్థం కోసమే ఏపీని హడావుడిగా విభజించారంటూ ఆరోపించారు మోదీ.

Modi And Kk
Parliament Modi Comments : ప్రధాని మోదీని టార్గెట్ చేసిన టీఆర్ఎస్ ఆయనపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చేందుకు టిఆర్ఎస్ యోచిస్తోంది. తెలంగాణ ఏర్పాటును కించపరిచేలా రాజ్యసభలో మోదీ వ్యాఖ్యలు ఉన్నాయన్న టీఆర్ఎస్ ఎంపీలు ధ్వజమెత్తారు. పార్లమెంట్ నిబంధనలు, నియమాల మేరకు ఆంద్రప్రదేశ్ పునర్విభజన చట్టం ఆమోదం పొందిందిని తెలిపారు. పార్లమెంట్ కార్యకలాపాలను, చట్ట సభను దిగజార్చేలా, పార్లమెంట్ ప్రిసైడింగ్ అధికారులను అగౌరవ పరిచేలా ప్రధాని వ్యాఖ్యలు ఉన్నాయని మండిపడ్డారు.
Read More : World Highest Chenab bridge : మేఘాలపై..ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జి లేటెస్ట్ ఫోటోలు
పార్లమెంట్ వేదికగా ఏపీ విభజనపై ప్రధాని నరేంద్ర మోదీ సంచలన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. రాజకీయ స్వార్థం కోసమే ఏపీని హడావుడిగా విభజించారంటూ ఆరోపించారు మోదీ. ఏపీ, తెలంగాణ వైషమ్యాలకు కాంగ్రెస్ పార్టీనే కారణమన్నారు. తెలంగాణ ఏర్పాటుకు తాను వ్యతిరేకం కాదన్న మోదీ.. విభజన కోసం అనుసరించిన పద్ధతి సరిగా లేదన్నారు. తెలంగాణ ఇచ్చినా కాంగ్రెస్‌ను ప్రజలు నమ్మలేదని మోదీ మండిపడ్డారు. ఏపీ, తెలంగాణ ఇంకా సమస్యలు ఎదుర్కొంటున్నాయన్నారు ప్రధాని మోదీ.
Read More : Colombia Mudslide: కొలంబియాలో కొండచరియలు విరిగిపడి 14 మంది మృతి
ప్రధానిపై ట్విట్టర్ వేదికగా విరుచుకుపడ్డారు మంత్రి కేటీఆర్. ప్రతీసారి తెలంగాణ ప్రజల దశాబ్దాల పోరాటాలను, త్యాగాలను అవమానించే విధంగా మోదీ మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణపై మోదీ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానన్న కేటీఆర్.. తెలంగాణ ప్రజలకు మోదీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. నల్ల జెండాలతో టీఆర్ఎస్ శ్రేణులు నిరసన తెలుపుతున్నారు.