TS Eamcet: ఎంసెట్ కౌన్సెలింగ్ గడువు పెంపు.. ఎప్పటి వరకంటే?

ఎంసెట్ కౌన్సెలింగ్ గడువును పెంచుతున్నట్లు సాంకేతిక విద్యాశాఖ ప్రకటించింది. సాధారణంగా నేటితో ఎంసెట్ కౌన్సెలింగ్ ముగియాల్సి ఉంది. తాజాగా ఆ గడువును పెంచుతున్నట్లు ప్రకటించింది.

TS Eamcet: ఎంసెట్ కౌన్సెలింగ్ గడువు పెంపు.. ఎప్పటి వరకంటే?

TS EAMCET

Updated On : August 30, 2022 / 1:36 PM IST

TS Eamcet: తెలంగాణ రాష్ట్రంలో మంగళవారం ఇంటర్ ద్వితీయ సంవత్సరం సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్‌ బోర్డు కార్యాలయంలో కార్యదర్శి జలీల్‌ ఫలితాలను ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఎంసెట్ కౌన్సెలింగ్ గడువును పెంచుతున్నట్లు సాంకేతిక విద్యాశాఖ ప్రకటించింది. సాధారణంగా నేటితో ఎంసెట్ కౌన్సెలింగ్ ముగియాల్సి ఉంది. తాజాగా ఆ గడువును పెంచింది.

NABI Recruitment : నేషనల్‌ అగ్రి ఫుడ్‌ బయోటెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్‌ లో ఉద్యోగ ఖాళీల భర్తీ

మంగళవారం విడుదలైన సప్లిమెంటరీలో ఉత్తీర్ణులైన వారి కోసం ధ్రువపత్రాల పరిశీలన, స్లాట్ బుకింగ్ గడువును ఎల్లుండి వరకు, ధ్రువపత్రాల పరిశీలన గడువు సెప్టెంబర్ 2 వరకు, అదేవిధంగా వెబ్ ఆప్షన్ల గడువు సెప్టెంబర్ 3వ తేదీ వరకు పెంచుతూ సాంకేతిక విద్యాశాఖ ప్రకటించింది. ఎంసెట్ లో ర్యాంకు సాధించినా.. ఇంటర్ అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల కాకపోవడంతో సోమవారం వరకు సందిగ్దత కొనసాగింది. మంగళవారం ఆ ఫలితాలు విడుదల కావటంతో ఎంసెట్ కౌన్సెలింగ్ గడువును పెంచుతున్నట్లు సాంకేతిక విద్యాశాఖ ప్రకటించింది.