TS PECET 2021 : టీఎస్ పీఈసెట్ పరీక్ష వాయిదా

టీఎస్ పీఈసెట్ -2021(TSPECET-2021) ప్ర‌వేశ ప‌రీక్ష వాయిదా పడింది. ఈ మేర‌కు మ‌హాత్మా గాంధీ యూనివ‌ర్సిటీ అధికారులు ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.

TS PECET 2021 : టీఎస్ పీఈసెట్ పరీక్ష వాయిదా

Ts Pecet

Updated On : September 27, 2021 / 7:51 PM IST

Exam Postponed : టీఎస్ పీఈసెట్ -2021(TSPECET-2021) ప్ర‌వేశ ప‌రీక్ష వాయిదా పడింది. ఈ మేర‌కు మ‌హాత్మా గాంధీ యూనివ‌ర్సిటీ అధికారులు ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. వాతావ‌ర‌ణ ప‌రిస్థితుల దృష్ట్యా ఈ నెల 30న నిర్వ‌హించాల్సిన టీఎస్ పీఈసెట్ ప్ర‌వేశ‌ప‌రీక్ష‌ను వాయిదా వేస్తున్నామ‌ని తెలిపారు. ఈ పరీక్షను అక్టోబ‌ర్ 23న‌ నిర్వ‌హిస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. సెంటర్లలో ఎటువంటి మార్పు ఉండదని.. ఇప్పటికే జారీ చేసిన హాల్ టికెట్లనే పరీక్షా కేంద్రానికి తీసుకురావాలని తెలిపారు.

Read More : Credit కార్డుతో పెట్రోల్ కొంటున్నారా? ఉపయోగాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు

మరోవైపు ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో 28,29 తేదీల్లో జరగాల్సిన డిగ్రీ పరీక్షలను వాయిదా వేశారు. 28, 29 తేదీల్లో భారీ వర్ష సూచన ఉండటంతో విద్యార్థులకు ఇబ్బంది కలుగకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు యూనివర్సిటీ వర్గాలు తెలిపాయి. 30 తేదీ జరగాల్సిన పరీక్ష యధావిధిగా జరుగుతుందని తెలిపారు. వాయిదా వేసిన పరీక్షల నిర్వహణ తేదీలపై రేపటి వరకు స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Read More : Chief Minister : సీఎం ఇంటిముందు ఆత్మహత్యాయత్నం