తెలంగాణలో గ్రూప్-1 ప్రిలిమ్స్ ఎగ్జామ్.. అభ్యర్థులు ఈ సూచనలు తప్పనిసరిగా పాటించాలి
గతంలో జరిగిన పరిణామాల నేపథ్యంలో పరీక్షల నిర్వహణకు పకడ్భందీ ఏర్పాట్లు చేపట్టారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయనున్నారు.

Group-1 Prelims Exam 2024
TSPSC Group 1 Prelims 2024 : తెలంగాణలో ఇవాళ గ్రూప్ -1 ప్రిలిమ్స్ పరీక్షలకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉదయం 10:30 నిమిషాల నుంచి మధ్యాన్నం ఒంటిగంట వరకు ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరగనుంది. రాష్ట్రంలో 563 గ్రూప్-1 పోస్టులకు 4లక్షల 3వేల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. గతంతో పోలిస్తే గ్రూప్ 1 పోస్టులకు దరఖాస్తు చేసుకున్నవారి సంఖ్య పెరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 897 ఎగ్జామ్ సెంటర్లలో గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించనున్నారు.
Also Read : కేంద్ర క్యాబినెట్‌లో తెలంగాణకు దక్కే పదవులు ఎన్ని? రేసులో ఎవరెవరు ఉన్నారు?
ప్రభుత్వ పరిపాలనలో గ్రూప్-1 పోస్టులకు అధిక ప్రాధాన్యత ఉంది. గతంలో జరిగిన పరిణామాల నేపథ్యంలో పరీక్షల నిర్వహణకు పకడ్భందీ ఏర్పాట్లు చేపట్టారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయనున్నారు. పరీక్షా కేంద్రాలకు వచ్చేవారికోసం టీజీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. ఇదిలాఉంటే.. ఉదయం 10గంటలకు ఎగ్జామ్ సెంటర్లకు తప్పనిసరిగా వెళ్లాలి. కచ్చితంగా 10గంటలకు పరీక్షా కేంద్రం గేట్లు మూసివేస్తారు. అదేవిధంగా హాల్ టికెట్ మీద లేటెస్ట్ ఫోటోను అటాచ్ చేయడంతోపాటు గుర్తింపు కార్డును తీసుకురావాలని అధికారులు సూచించారు.
Also Read : Chandrababu Naidu : చంద్రబాబు ప్రమాణస్వీకారం సమయంలో మార్పు అవాస్తవం.. పార్టీవర్గాలు వెల్లడి!
- అభ్యర్థులు ఇవి పాటించాలి..
ఉదయం 10గంటలకు ముందుగానే పరీక్షా కేంద్రంలోకి వెళ్లాలి. కచ్చితంగా 10గంటలకు గేట్లు మూసివేస్తారు.
పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారు.
పరీక్ష హాల్ లోకి కాలిక్యులేటర్లు, పేజర్లు, సెల్ ఫోన్లు, ట్యాబ్ లు, పెన్ డ్రైవ్ లు, బ్లూటూత్ లు, మ్యాథమెటికల్ లేబుళ్లు, బ్యాగులు, రైటింగ్ ప్యాడ్ లు, ఎలక్ట్రానిక్, రికార్డింగ్ వస్తువులకు అనుమతి లేదు.
హాల్ టికెట్ పై లేటెస్ట్ ఒరిజినల్ పాస్ పోర్టు సైజు ఫొటో అతికించాలి.
కలర్ లో, ఏ4 సైజులో లేదా లేజర్ ప్రింటర్ ద్వారా హాల్ టికెట్ డౌన్ లోడ్ చేసుకోవాలి.
ప్రిలిమినరీ పరీక్షలు ఓఎంఆర్ ఆన్సర్ షీట్ విధానంలో నిర్వహిస్తున్నారు. బయోమెట్రిక్ ద్వారా అటెండెన్స్ ను స్వీకరిస్తారు.
బయోమెట్రిక్ వేలిముద్ర వివరాల రికార్డింగ్ ఉన్న క్రమంలో అభ్యర్థులు తమ వేళ్లపై మెహెందీ లేదా ఏదైనా ఇతర ప్రింటెడ్ రంగులు ఉంచుకోరాదు
అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు బూట్లు ధరించకుడదు, చప్పల్స్ మాత్రమే వేసుకోవాలి