Chandrababu Naidu : చంద్రబాబు ప్రమాణస్వీకారం సమయంలో మార్పు అవాస్తవం.. పార్టీవర్గాలు వెల్లడి!

Chandrababu Naidu : చంద్రబాబు ప్రమాణస్వీకార సమయంలో ఎలాంటి మార్పులేదు. ఈ మేరకు పార్టీవర్గాలు ఒక ప్రకటనలో వెల్లడించాయి. కృష్ణా జిల్లా గన్నవరం సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద ఈ వేడుక జరుగనుంది.

Chandrababu Naidu : చంద్రబాబు ప్రమాణస్వీకారం సమయంలో మార్పు అవాస్తవం.. పార్టీవర్గాలు వెల్లడి!

TDP Chief Chandrababu Naidu Swearing in Ceremony ( Image Source : Google )

Updated On : June 8, 2024 / 11:29 PM IST

Chandrababu Naidu : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ నెల 12న అమరావతిలో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. అయితే, చంద్రబాబు ప్రమాణస్వీకార సమయంలో మార్పులు చేసినట్టు వచ్చిన సమాచారం పూర్తిగా అవాస్తమని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

షెడ్యూల్ ప్రకారం.. జూన్ 12న చంద్రబాబు ఉదయం 11.27 గంటలకు ప్రమాణస్వీకారోత్సవం చేస్తారని టీడీపీ తెలిపింది. అయితే ఏపీ సీఎంవో పేరుతో వచ్చిన ట్వీట్‌లో ఉదయం 9.27 గంటలకు ప్రమాణ స్వీకారం అని తప్పుగా పోస్ట్ చేశారు. ఆ తర్వాత ఆ ట్వీట్‌ను సీఎంఓ తొలగించింది. ముందుగా నిర్ణయించిన సమయం (ఉదయం 11:27 నిమిషాలకు) ప్రకారమే చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయనున్నారని పార్టీ వర్గాలు నిర్థారించాయి.

 

Read Also : Rahul Gandhi: ఆ లోక్‌సభ స్థానానికి రాజీనామా చేయనున్న రాహుల్ గాంధీ?

ఈ మేరకు ఏపీ సీఎంఓ అధికారిక ట్విట్టర్ అకౌంట్ ద్వారా వెల్లడించింది. కృష్ణా జిల్లా గన్నవరం సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద ఈ వేడుక జరుగుతుందని సీఎంఓ ట్వీట్ చేసింది. అంతేకాదు.. ప్రమాణ స్వీకారం తేదీ, వేదిక, ముహుర్తాన్ని కూడా సీఎంఓ ప్రకటించింది.

దీనికి సంబంధించి ఏర్పాట్ల పర్యవేక్షణ కోసం ఐదుగురు సీనియర్ అధికారులను కూడా ప్రభుత్వం నియమించింది. ఎ.బాబు, హరిజవహర్ లాల్, కన్నబాబు, హరికిరణ్, వీర పాండ్యన్ ను నియమించింది. జేఏడీ పొలిటికల్ సెక్రటరీ ఆధ్వర్యంలో ఈ ఐదుగురు అధికారులు చంద్రబాబు ప్రమాణస్వీకారోత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించనున్నారు.

Read Also : Rajinikanth : ప్రధాని మోదీ, చంద్రబాబుల ప్రమాణ స్వీకారోత్సవానికి రజనీకాంత్‌కు ఆహ్వానం!