Rajinikanth : ప్రధాని మోదీ, చంద్రబాబుల ప్రమాణస్వీకారోత్సవానికి రజనీకాంత్‌కు ఆహ్వానం!
Rajinikanth : ఇటీవల ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవాలకు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌కు ఆహ్వానం అందింది.

Rajinikanth gets invited for PM Narendra Modi and Chandrababu ( Image Source : Google )
Rajinikanth : తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ భారతీయ నటీనటుల్లో ఒకరు. ఆయనకు ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. చాలా ఏళ్లుగా రజినీకాంత్ పొలిటికల్ ఎంట్రీపై గందరగోళం కొనసాగింది. ఆ తర్వాత తాను రాజకీయాలకు నో చెప్పేశారు. అయినప్పటికీ, సూపర్ స్టార్ నటుడిగా మాత్రమే కాకుండా రాజకీయాలు, రాజకీయ నేతలకు దగ్గరగా ఉంటునే ఉన్నారు. ఇటీవల ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవాలకు రజనీకాంత్‌కు ఆహ్వానం అందింది.
Read Also : ఏపీకి 4, తెలంగాణకు 2 పదవులు..? కేంద్ర మంత్రివర్గ కూర్పుపై బీజేపీ కసరత్తు
మూడోసారి పీఎంగా మోదీ ప్రమాస్వీకారం :
నరేంద్ర మోదీ భారత ప్రధానిగా ముచ్చటగా మూడోసారి ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. రేపు ఢిల్లీలో (జూన్ 9) గ్రాండ్ వేడుక జరగనుంది. ఈ కార్యక్రమానికి సినీపరిశ్రమల నుంచి పలువురు ప్రముఖ తారలను ఆహ్వానించారు. మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి దేశవిదేశాల నుంచి అనేక మంది ప్రముఖులను ఆహ్వానిస్తున్నారు. అయితే, దక్షిణాది నుంచి రజనీకాంత్‌ను కూడా మోదీ ప్రమాణస్వీకారోత్సవానికి ఆహ్వానించినట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
ఈ నెల 12న చంద్రబాబు ప్రమాణస్వీకారోత్సవం :
అదేవిధంగా, జూన్ 12న అమరావతిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు సైతం ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు కూడా రజనీకాంత్‌ను ఆహ్వానించినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో తలైవా రాజకీయ కార్యక్రమాలకు హాజరుకానున్నారు. వాస్తవానికి, రజనీకాంత్, చంద్రబాబు నాయుడు చాలా కాలంగా మంచి స్నేహితులు. అనేకసార్లు ఒకరినొకరు ప్రశంసించుకున్నారు.
లోక్‌సభ ఎన్నికల్లోనూ , ఆంధ్ర అసెంబ్లీ ఎన్నికల్లోనూ విజయం సాధించినందుకు ప్రధాని మోదీ, చంద్రబాబుకు రజనీకాంత్ తన సోషల్ మీడియా పేజీ ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు. వారిద్దరి విజయం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇక, రజనీ సినిమా విషయాలకు వస్తే.. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ‘ కూలీ ‘ షూటింగ్‌ను ప్రారంభించబోతున్నారు. అతి కొద్ది రోజుల్లో ఈ మూవీ షూటింగ్ మొదలు కానుంది.
Read Also : Rahul Gandhi: ఆ లోక్‌సభ స్థానానికి రాజీనామా చేయనున్న రాహుల్ గాంధీ?