TSPSC Notification : నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్.. వ్యవసాయ, విద్యాశాఖల్లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

తెలంగాణలో కొలువుల జాతర నెలకొంది. రాష్ట్రంలో వరుసుగా ఉద్యోగా నోటిఫికేషన్లు విడుదలవుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో ఖాళీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. తాజాగా మరో రెండు శాఖల్లో ఖాళీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేసింది.

TSPSC Notification : నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్.. వ్యవసాయ, విద్యాశాఖల్లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

TSPSC

Updated On : December 28, 2022 / 11:37 PM IST

TSPSC Notification : తెలంగాణలో కొలువుల జాతర నెలకొంది. రాష్ట్రంలో వరుసుగా ఉద్యోగాల నోటిఫికేషన్లు విడుదలవుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో ఖాళీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. తాజాగా మరో రెండు శాఖల్లో ఖాళీ పోస్టుల భర్తీకి టీఎస్ పీఎస్సీ నోటిఫికేషన్లు విడుదల చేసింది.

వ్యవసాయ శాఖలో 148 వ్యవసాయ అధికారి పోస్టు భర్తీకి టీఎస్ పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. మల్టీజోన్-1లో 100 పోస్టులు, మల్టీజోన్ -2లో 48 పోస్టులను నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. వచ్చే ఏడాది జనవరి 10 నుంచి 30వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు.

Telangana Government Jobs : నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం మరో గుడ్‌న్యూస్.. 16వేల 940 ఉద్యోగాలు భర్తీ

విద్యాశాఖలో 128 ఫిజికల్ డైరెక్టర్ పోస్టులకు టీఎస్ పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది.
సాంకేతిక విద్యాశాఖలో 37, ఇంటర్మీడియట్ విద్యాశాఖలో 91 ఫిజికల్ డైరెక్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
జారీ చేసింది. వచ్చే ఏడాది జనవరి 6 నుంచి 27వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించనున్నారు.

ఈ ఉద్యోగ నియామకాలకు 18-44 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న కల్గినవారు అర్హులు. పూర్తి వివరాలను tspsc.gov.in వెబ్ సైట్ లో సంప్రదించాలని సూచించింది.