TSPSC Notification 207 Jobs : నిరుద్యోగులకు టీసర్కార్ గుడ్ న్యూస్.. మరో 207 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
తెలంగాణలో కొలువుల జాతర నెలకొంది. రాష్ట్రంలో ఉద్యోగ నియామకాల ప్రక్రియ వేగవంతమైంది. నిరుద్యోగులకు టీప్రభుత్వం మరోసారి గుడ్ న్యూస్ తెలిపింది. మరో 207 ఖాళీ పోస్టులను భర్తీ చేయనుంది.

TSPSC
TSPSC Notification 207 Jobs : తెలంగాణలో కొలువుల జాతర నెలకొంది. రాష్ట్రంలో ఉద్యోగ నియామకాల ప్రక్రియ వేగవంతమైంది. నిరుద్యోగులకు టీప్రభుత్వం మరోసారి గుడ్ న్యూస్ తెలిపింది. మరో 207 ఖాళీ పోస్టులను భర్తీ చేయనుంది. టీఎస్ పీఎస్సీ డిసెంబర్ లో వరుస నోటిఫికేషన్లు ఇస్తోంది. తాజాగా మరో 207 ఉద్యోగాలకు రెండు వేర్వేరు నోటిఫికేషన్లు జారీ చేసింది.
ఈ మేరకు గురువారం (డిసెంబర్ 22,2022) టీఎస్ పీఎస్సీ సెక్రటరీ అనితా రామచంద్రన్ ఖాళీ పోస్టుల వివరాలను వెల్లడించారు. వెటర్నరీ డిపార్ట్ మెంట్ లో 185 అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు డిసెంబర్ 30 నుంచి జనవరి 19వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు.
హార్టికల్చర్ డిపార్ట్ మెంట్ లో 22 హార్టికల్చర్ ఆఫీసర్ ఉద్యోగాలకు వచ్చే ఏడాది జనవరి 3 నుంచి 24వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు. అయితే, దరఖాస్తు తేదీలను పొడిగించబోమని స్పష్టం చేశారు. అభ్యర్థులు ఆఖరి రోజు వరకు వేచి చూడకుండా వెంటనే దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. పూర్తి వివరాల కోసం https://www.tspsc.gov.in వెబ్ సైట్ లో సంప్రదించాలని సూచించారు.