కొత్తలంకపల్లి వివాహిత హత్య కేసు..నిందితుడు నాగశేషురెడ్డి మేనమామ కూతురు ఆత్మహత్య

కొత్తలంకపల్లి వివాహిత హత్య కేసు..నిందితుడు నాగశేషురెడ్డి మేనమామ కూతురు ఆత్మహత్య

Updated On : February 5, 2021 / 9:24 PM IST

Married woman Murder Case : ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం కొత్తలంకపల్లి వివాహిత హత్య కేసులో ట్విస్ట్ నెలకొంది. భార్యను హత్య చేసిన నాగశేషురెడ్డి.. మేనమామ కూతురు వెనీలా ఆత్మహత్య చేసుకుంది. వెనీలా నాగశేషురెడ్డితో ప్రేమాయణం సాగించింది.

భార్య నవ్యారెడ్డిని నాగశేషురెడ్డి చంపాడని తెలుసుకున్న వెనీల.. మనస్థాపానికి గురైంది. తొండలగోపవరం సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. నవ్యారెడ్డి, వెనీలా ఇద్దరూ నాగశేషురెడ్డికి మేనమామ కుమార్తెలేనని పోలీసులు గుర్తించారు.