రాజగోపాల్‌రెడ్డికి మంత్రి పదవి అవకాశం లేనట్లేనా?
సీఎం రేవంత్ రెడ్డి పార్టీ అధిష్టానం దగ్గర తనకు మద్దతుగా నిలవకపోవడంతో రాజగోపాల్‌రెడ్డి ఆగ్రహంతో రగలిపోతున్నారట. అందుకే ఛాన్స్ దొరికిన ప్రతీసారి సీఎం రేవంత్ రెడ్డిని ఇరకాటంలో పెట్టేలా ఎక్స్ వేదికగా విమర్శలు ఎక్కుపెడుతున్నారట.

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అల్టిమేట్ డ్రీమ్ మంత్రి కావడం. ఆ మంత్రి పదవి కోసమే ఎన్ని ప్రయత్నాలు చేసినా వర్క్ అవుట్ కావడం లేదు. స్వయంగా పార్టీ అధిష్టానం హామీ ఇచ్చినా అమాత్య యోగం దక్కకపోవడంతో ఫుల్ లోడ్ ఫైర్ మీదుంటున్నారాయన. రెండో విడుత మంత్రివర్గ విస్తరణలో రాజగోపాల్‌కు ఛాన్స్ ఉంటుందని అంతా భావించారు. కానీ ఈక్వేషన్స్ వర్కౌట్ కాలేదు. రాజగోపాల్‌రెడ్డికి మంత్రి పదవి దక్కలేదు. మిగతా మూడు బెర్తుల్లోనూ ఆయనకు అవకాశం లేనట్లేనన్న టాక్ వినిపిస్తోంది. దాంతో ఆయన ఫ్రస్ట్రేషన్ పీక్ లెవల్‌కు చేరుకుందట. ఓ ముఖ్యనేతనే తనకు అమాత్య యోగం దక్కకుండా అడ్డుపడుతున్నారని గురి ఎక్కుపెడుతున్నారు రాజగోపాల్‌డ్డి.
ప్రభుత్వం వచ్చిన సందర్భంగా ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఏర్పాటులోనే పదవి కోసం గట్టి ప్రయత్నం చేశారాయాన. తన సోదరుడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆల్ రెడీ మంత్రి రేసులో ఉండటంతో రాజగోపాల్‌రెడ్డికి ఛాన్స్ దక్కలేదు. ఆ తర్వాత మూడు బెర్తులు ఫిలప్ చేసినప్పుడు రాజగోపాల్‌రెడ్డి పేరు ప్రముఖంగా వినిపించింది. అందుకు కారణం. ఎన్నికలకు ముందు ఆయనను పార్టీ చేర్చుకున్నప్పుడు రాష్ట్ర నేతలు ఇచ్చిన హామీ ఒకటైతే. ఆ తర్వాత లోక్ సభ ఎన్నికల్లో భువనగిరి ఎంపీని గెలిపిస్తే క్యాబినెట్‌లోకి తీసుకుంటామని అధిష్టానమే హామీ ఇచ్చిందంటున్నారు రాజగోపాల్‌రెడ్డి.
ఈ ఈక్వేషన్స్ నేపథ్యంలో మొన్నటి విస్తరణలో రాజగోపాల్‌రెడ్డికి బెర్త్ పక్కా అనుకున్నారు. అయితే ఒకే కుటుంబం నుంచి ఇద్దరికి పదవులు ఇవ్వడం కుదరదని అధిష్టానం స్పష్టం చేసిందట. రాజగోపాల్‌రెడ్డిని క్యాబినెట్‌లోకి తీసుకోవాలంటే వెంకట్‌రెడ్డికి ఉద్వాసన పలకాల్సిందేనని స్పష్టం చేసిందట హైకమాండ్. ఇద్దరు అన్నదమ్ముల్లో ఎవరు క్యాబినెట్‌లో ఉండాలో మీ ఛాయిస్ అంటూ అధిష్టానం సీఎం రేవంత్‌ను అడిగితే..సీఎం మాత్రం వెంకట్‌రెడ్డికి ఓటేశారట. రాజగోపాల్‌కు నో చెప్పారట. రాజగోపాల్ విషయంలో సీఎంకు కొన్ని అభ్యంతరాలున్నాయట. ఒకవేళ మంత్రిగా ఛాన్స్ ఇస్తే రాజగోపాల్ స్వభావం రిత్యా.. ఆయన ఎప్పుడు ఎలా మాట్లాడుతారోనన్న భావనలో సీఎం ఉన్నారట.
అంతేకాదు తనకు హోంమంత్రి పదవి కావాలని రాజగోపాల్ పట్టుపట్టారు. అదికాకుండా ఇతర ఏ శాఖలు ఇచ్చినా..సంతృప్తి చెందే రకం కాదు. సీఎంగా శాఖల విషయంలో ఏదైనా నిర్ణయం తీసుకున్నా..మంత్రిగా రాజగోపాల్ ఎలా రియాక్ట్ అవుతారోనని భావించారట రేవంత్. అందుకే వెంకట్‌రెడ్డికి మద్దతుగా నిలిచారట సీఎం. పోనీ మాటిచ్చాం కాబట్టి రాజగోపాల్‌రెడ్డికి బెర్త్ ఇద్దామని హైకమాండ్ ఆలోచన చేస్తుంటే..సుదర్శన్‌రెడ్డిని క్యాబినెట్ రేసులోకి తెచ్చారట రేవంత్.
సీఎం సపోర్ట్‌తో వెంకట్‌రెడ్డిని తప్పించలేకపోయారు. ఇక సుదర్శన్‌రెడ్డిని కాదని కూడా రాజగోపాల్‌రెడ్డికి అమాత్య యోగం దక్కలేదు. పైగా ఇద్దరి పేర్లను పక్కన పెట్టేశారట. ఇదంతా సీఎం రేవంత్‌రెడ్డే చేశారనేది రాజగోపాల్‌రెడ్డి ఆగ్రహానికి కారణమట. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రాజగోపాల్‌రెడ్డికి మంత్రి పదవి హామీ ఇచ్చింది నిజమేనని..అప్పుడు తాను కూడా ఉన్నానని చెప్పారు. ఆయన వ్యాఖ్యలకు థ్యాంక్స్ చెప్తూ కొందరు తనకు పదవి రాకుండా అడ్డుకుంటున్నారని రేవంత్ టార్గెట్‌గా ఎక్స్‌లో ట్వీట్ చేశారు రాజగోపాల్‌రెడ్డి.
సీఎం రేవంత్ రెడ్డి పార్టీ అధిష్టానం దగ్గర తనకు మద్దతుగా నిలవకపోవడంతో రాజగోపాల్‌రెడ్డి ఆగ్రహంతో రగలిపోతున్నారట. అందుకే ఛాన్స్ దొరికిన ప్రతీసారి సీఎం రేవంత్ రెడ్డిని ఇరకాటంలో పెట్టేలా ఎక్స్ వేదికగా విమర్శలు ఎక్కుపెడుతున్నారట. ఇప్పుడు అన్నదమ్ములిద్దరినీ క్యాబినెట్‌లోకి తీసుకోవడం కుదరన్న వాదనపై కూడా సీరియస్‌గానే రియాక్ట్ అయ్యారు రాజగోపాల్‌రెడ్డి. తనను పార్టీలోకి తీసుకున్నప్పుడు ఇద్దరం అన్నదమ్ములం కాంగ్రెస్‌లో ఉన్నామని తెలియదా అని ప్రశ్నించారు. లోక్‌సభ ఎన్నికలప్పుడు, రెండోసారి ప్రామిస్ చేసినప్పుడు తెలియదా తామిద్దరం అన్నదమ్ములం ఉన్నామని అంటూ క్వశ్చన్ చేశారు.
ఇద్దరం సమర్థులమే, ఇద్దరం గట్టి వాళ్లమే.. ఇద్దరికి మంత్రి పదవులు ఇస్తే తప్పేంటి.? అంటూ వాయిస్ రేజ్ చేస్తున్నారు. సమీకరణాలు కుదరటం లేదు అంటున్నారు..ఎందుకు కుదరటం లేదు..ఎవరు అడ్డుకుంటున్నారంటూ ఓపెన్ స్టేట్‌మెంట్ ఇచ్చారు. 9 మంది ఎమ్మెల్యేలు ఉన్న ఖమ్మం జిల్లాకు ముగ్గురు మంత్రి పదవులు ఇచ్చారు..11 మంది ఎమ్మెల్యేలు ఉన్న నల్గొండ జిల్లాకు ముగ్గురు మంత్రులు ఉంటే తప్పా అంటూ ప్రశ్నిస్తున్నారు. అయితే మాటిచ్చి తప్పారని..దేనికైనా రెడీ అంటున్న రాజగోపాల్‌రెడ్డి ఏ టైమ్‌లో ఏ బాంబ్ పేలుస్తారోనన్న ఉత్కంఠ మాత్కం కంటిన్యూ అవుతోంది.