Allu Arjun Arrest : అరెస్ట్, జైల్, బెయిల్.. అల్లు అర్జున్ అరెస్ట్ ఎపిసోడ్‌లో ట్విస్టులే ట్విస్టులు.. మినిట్ టు మినిట్..
అల్లు అర్జున్ ని చంచల్ గూడ జైలుకి తరలించిన కొన్ని క్షణాల్లోనే మధ్యంతర బెయిల్ మంజూరు.

Allu Arjun Arrest : హీరో అల్లు అర్జున్ అరెస్ట్ ఎపిసోడ్ లో ఉదయం నుంచి అనూహ్య పరిణామాలు చోట చేసుకున్నాయి. అరెస్ట్ దగ్గరి నుంచి జైలుకి తరలించే వరకు ఆ ఆరు గంటలు ఉత్కంఠభరితంగా సాగాయి. ప్రతీ సెకను టెన్షన్, అనుక్షణం ఉత్కంఠగా సాగిన ఈ వ్యవహారం మొత్తం పుష్ప, పుష్ప 2 సినిమాలను మించిపోయింది. అల్లు అర్జున్ అరెస్ట్, జైలు, బెయిల్.. ఇలా అన్నీ అనూహ్యంగా జరిగిపోయాయి. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన కేసులో ట్విస్టులే ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి.
అసలేం జరిగింది.. మినిట్ టు మినిట్..
* శుక్రవారం ఉదయం 11 55 నిమిషాలకు అల్లు అర్జున్ ఇంటికి వెళ్లిన చిక్కడపల్లి పోలీసులు
* మధ్యాహ్నం 12 గంటలకు అరెస్ట్ చేస్తున్నాం అంటూ అల్లు అర్జున్ కు తెలిపిన పోలీసులు
* అరెస్ట్ చేసే క్రమంలో పోలీసుల తీరుపై బన్నీ ఆగ్రహం
* కనీసం డ్రెస్ మార్చుకోవడానికైనా సమయం ఇవ్వరా అంటూ పోలీసులపై అసహనం
* బెడ్ రూమ్ లోకి కూడా రావడం ఏంటని మండిపాటు
* 12 గంటల 15 నిమిషాలకు బన్నీ అరెస్ట్
* 12 గంటల 20 నిమిషాలకు అతడి నివాసం నుంచి తరలింపు
* మధ్యాహ్నం 1 గంట సమయానికి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు బన్నీ తరలింపు
* చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో అల్లు అర్జున్ స్టేట్ మెంట్ రికార్డ్
* మధ్యాహ్నం 2 గంటలకు చిక్కడపల్లి పీఎస్ నుంచి గాంధీ ఆసుపత్రికి బన్నీ తరలింపు
* మధ్యాహ్నం 3 గంటలకు గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు
* ఆ తర్వాత నాంపల్లి కోర్టులో మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచిన పోలీసులు
* వాదనలు విన్న తర్వాత అల్లు అర్జున్ కు 14 రోజుల రిమాండ్ విధింపు
* 5 గంటల 20 నిమిషాలకు చంచల్ గూడ జైలుకి బన్నీ తరలింపు
* సూపర్ ట్విస్ట్ ఇచ్చిన హైకోర్టు
* అల్లు అర్జున్ పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు సుదీర్ఘ వాదనల తర్వాత 5గంటల 35 నిమిషాలకు అల్లు అర్జున్ కు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ పుష్ప 3 ట్విస్ట్ ఇచ్చింది.
* అర్ణబ్ గోస్వామి తీర్పు ప్రకారం బన్నీకి 4 వారాల మధ్యంతర బెయిల్ ఇచ్చిన కోర్టు
* అల్లు అర్జున్ ని చంచల్ గూడ జైలుకి తరలించిన కొన్ని క్షణాల్లోనే కోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది.
Also Read : సెలెబ్రిటీకో న్యాయం, సామాన్యుడికో న్యాయమా? జర్నలిస్ట్ పై దాడి జరిగితే రాజకీయ నేతల మౌనం ఎందుకు?