Beggars Murder: హైదారాబాద్లో యాచకుల హత్య.. వేరు వేరు చోట్ల ఒకేలా చంపేశారు
హైదరాబాద్ నగరంలోని నాంపల్లిలో యాచకులను దారుణంగా హత్య చేశారు గుర్తు తెలియని వ్యక్తులు.

Beggar
Beggars Murder: హైదరాబాద్ నగరంలోని నాంపల్లిలో యాచకులను దారుణంగా హత్య చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. మొదటి హత్య హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరగగా.. రెండో హత్య నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. యాచకులు ఇద్దరినీ తలపై రాయితో మోది చంపేశారు.
రెండు హత్యల్లో కూడా చంపడానికి ఉపయోగించిన ఆయుధం రాయే కాగా.. తలపై ఒకేలా కొట్టడం చూస్తుంటే, కచ్చింతంగా ఒకరే రెండు హత్యలు చేసి ఉండొచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు. సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా కేసు దర్యాప్తు చేపట్టారు పోలీసులు.