Two Killed : డీసీఎం దగ్ధమై క్లీనర్ సజీవ దహనం, రోడ్డు ప్రమాదంలో మరొకరు మృతి
ప్రమాదం జరిగిన స్థలంలోనే క్లీనర్ పూర్తిగా కాలిపోయాడు. హనుమకొండ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు.

Two killed in Telangana
Two killed Separate Accidents : తెలంగాణలో రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందారు. ఖమ్మం జిల్లాలో డీసీఎం దగ్ధం కావడంతో క్లీనర్ సజీవ దహనం అయ్యారు. హనుమకొండ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. ఖమ్మం – సూర్యాపేట జాతీయ రహదారిపై డీసీఎం తగలబడింది. దీంతో క్లీనర్ మంటల్లో కాలిపోయి సజీవ దహనం అయ్యారు. మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి.
డీసీఎం కెమికల్ లోడుతో వెళ్తుండగా ప్రమాదం జరిగింది. రసాయనాలు నింపిన డ్రమ్ముల లోడుతో వాహనం తుని నుంచి చర్లపల్లి వెళ్తోంది. కూసుమంచి మండలం గురవాయిగూడెం తండా సమీపంలో ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన స్థలంలోనే క్లీనర్ పూర్తిగా కాలిపోయాడు. తీవ్రంగా కాలిపోయిన మరో వ్యక్తిని చికిత్స కోసం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Road Accident : బాపట్ల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీని ఢీకొన్న ఆటో, నలుగురు మృతి
ఈ ప్రమాదంలో మృతుడు వాసం ఆదినారాయణ(43) క్లినర్. అతని స్వస్థలం ఎస్. రాయవరం, అనకాపల్లి. క్షతగాత్రుడు కుక్కశెట్టి వెంకటేష్.. వాహన డ్రైవర్ / ఓనర్ అతని స్వస్థలం అనకాపల్లి. ప్రమాద తీవ్రతకు జాతీయ రహదారి డ్యామేజ్ అయింది. దీంతో బ్రిడ్జిపై రాకపోకలు నిలిపివేసిన పోలీసులు సర్వీస్ రోడ్ నుంచి వాహనాలను పంపిస్తున్నారు.
హనుమకొండ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. కమలాపూర్ మండలం అంబాల గ్రామ శివారులో ఆటో ట్రాలీ టైరు ఊడిపోవడంతో చెట్టుకు ఢీకొట్టింది. దీంతో ఒకరు మృతి చెందారు. నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మరో ఇద్దరికి గాయాలు అయ్యాయి. వివాహ వేడుకలకు డీజే పెట్టి తిరిగి వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.